Gandhi Death Anniversary: గాంధీని చంపిన ముఠాలో తెలుగు వ్యక్తి....ఆయనెవరు..ఏమయ్యాడు..?| ABP Desam
30 జనవరి 1948. భారత దేశం ఉలిక్కిపడ్డ రోజు. ప్రపంచమే మొత్తం నివ్వెరపోయినరోజు. అహింసే ఆయుధంగా తెల్లవాళ్ళని పారద్రోలిన మహాత్ముడు విద్వేషానికి బలైపోయాడు. నాథురాం గాడ్సే పేల్చిన తుపాకీ గుళ్ళకి ప్రాణాలు వదిలిన మాహాత్ముడు జాతిపితగా దేశం గుండెల్లో గౌరవం అందుకున్నాడు. ఆయన్ని చంపిన గాడ్సే ఉరికంబం ఎక్కాడు. ఇంతవరకూ చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే నిజానికి గాంధీని చంపడానికి సిద్ధమైన ముఠాలో గాడ్సే, అంప్టేలది ప్రత్యక్ష పాత్ర అయితే వారితో పాటు కుట్రపన్నారంటూ అప్పట్లో కోర్టు దోషులుగా తేల్చింది మాత్రం 8 మందిని. వీరు కాకుండా పాటు సావర్కర్ పేరు మొదట పెట్టినా ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు . అయితే వారిలో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉండడం గమనార్హం. అతనే శంకర కిష్టయ్య!





















