Army Helicopter Crash Live Updates : ఊటీలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
తమిళనాడు ఊటీలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లా కన్నూర్‌లోని ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే సైనికాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ కూలినట్లు నీలగిరి కలెక్టర్ అమృత్ స్పష్టం చేశారు. ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. కుప్పకూలిన హెలికాప్టర్‌లో త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆయన సిబ్బంది, కొంత మంది కుటుంబీకులు ఉన్నట్లు సమాచారం. గాలింపు, సహాయక చర్యల్లో ఆర్మీ నిమగ్నమైంది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొది. నలుగురు మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కోయంబత్తూర్ మెడికల్ టీం ఘటనా స్థలికి చేరుకొని సహాయసహకారాలు అందిస్తోంది.





















