Chittoor Employees Rally: చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీ..
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరాలంటే ధర్నాలు, ఉద్యమాలు వేరే మార్గం లేదని పిఆర్సీ సాధన సమితి సభ్యులు సురేష్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు నిర్వహించాయి. నగరంలోని ఎన్జీవో హోమ్స్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో ఉద్యోగ సంఘనేతలు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుండి ఉద్యోగులు హాజరై తమ నిరసనను తెలియజేశారు.ఈ సందర్భంగా పిఆర్సీ సాధన సమితి నాయకులు మీడియాతో మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీలో అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతో ఇవాళ ఉద్యోగులు అంతా రోడ్లపైకి రావడం జరిగిందన్నారు.





















