America Attack on Iran | ఇరాన్‌పై అమెరికా దాడి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు అమెరికా కూడా ఎంటర్ అయిపోయింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై తమ ఫైటర్ జెట్స్ దాడి చేసాయి అని వెల్లడించారు ట్రంప్. ఇరాన్‌పై దాడి చేసి ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు కూడా తెలిపారు ట్రంప్.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి అమెరికా రెండు వారాలు టైమ్ ఇచ్చినట్లు చెప్పిన 48 గంటలలోపే ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ కచ్చితంగా శాంతి చర్చలకు రావాల్సిందే. లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు చేస్తాం అంటూ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
ఈ సందర్బంగా ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందని అన్నారు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్‌పై దాడి తర్వాత అమెరికా అలెర్ట్ అయింది. అమెరికాలోని ముఖ్యమైన నగరాల్లో భద్రతా సంస్థలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.




















