Thalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP Desam
తలపతి విజయ్ 2026 తమిళనాడు ఎన్నికలే టార్గెట్ గా తన పార్టీ వ్యూహాలను స్పీడ్ అప్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలకు స్వస్తి చెబుతానని బహిరంగ ప్రకటన చేశారు. అక్టోబర్ 2025లో రిలీజ్ చేస్తామని KVN ప్రొడక్షన్ హౌస్ ప్రకటించిన తలపతి 69 సినిమానే విజయ్ కెరీర్ లో చివరి సినిమానట. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమా అని అందుకే పోస్టర్ లో వెలుగుతున్న కాగడాను చూపించారని ప్రచారం జరిగిన ఈ సినిమాకు సంబంధించిన క్యా అండ్ క్రూను కూడా ప్రకటించింది చిత్ర బృందం. విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే మరోసారి సందడి చేయనుంది. బీస్ట్ సినిమా తర్వాత విజయ్ పూజా కలిసి చేస్తున్న సినిమా ఇది. అంతే కాదు ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ను ప్రేమలు సినిమా తో యూత్ లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ మమితా బైజు ప్లే చేయనుంది. ఇక కీలక పాత్రలో గౌతమ్ మీనన్, అండ్ విలన్ గా బాబీ డియోల్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించే మరో క్రేజీ గాసిప్ కూడా వినపడుతోంది. ఈ సినిమా తెలుగులో రిలీజై సూపర్ హిట్టైన నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. కాజల్ పాత్రలో పూజా హెగ్డే..శ్రీలీల పాత్రలో మమిత బైజు...అర్జున్ రామ్ పాల్ పాత్రను బాబీ డియోల్ పోషిస్తున్నారని టాక్. మరి నేలకొండపల్లి భగవంత్ కేసరిగా బాలయ్య చూపించిన మార్క్ ను విజయ్ రిపీట్ చేస్తారా లేదా ఈ టాక్ తో సంబంధం లేని ఓ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ తో తలపతి కెరీర్ కు వీడ్కోలు చెప్తారా చూడాలి.