Jr NTR with Muruga Book for Trivikram Movie | త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్
దర్శకుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ఒక కథని రెడీ చేసారు. పుష్ప 2 తరువాత ఈ చిత్రం పట్టాలెక్కుతుందని అందరు అనుకున్నారు.
త్రివిక్రమ్ ఈ కథ రాయడానికి చాలా టైం తీసుకోవడంతో బన్నీ అట్లీ కథకు ఓకే చెప్పి షూటింగ్ మొదలు పెట్టారు. ఇపుడు అదే కథని త్రివిక్రమ్ Jr ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నాగవంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారని సినీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌గా కనిపించబోతోన్నారు. అందుకే మురుగన్ కథను తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఈ పుస్తకాన్ని చదుతున్నట్టుగా తెలుస్తోంది. ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్ మురుగ పుస్తకాన్ని చేత పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు కూడా అని అంతా అనుకుంటున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ నెలలో వార్ 2 థియేటర్స్ లోకి రానుంది. దాంతో పాటు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ రెండు షెడ్యూల్స్‌ను ఫినిష్ చేసినట్టుగా తెలుస్తోంది. నెల్సన్ మూవీ కూడా లైన్లో ఉంది. దేవర 2 సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఇంత బిజీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి ఎన్టీఆర్ డేట్లు ఎప్పుడు సెట్ చేస్తారో తెలియాలి. ముందు ఎవరి మూవీ థియేటర్స్ కి రాబోతుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేసాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి డేట్స్ ఇస్తే.. ఆ లోపు త్రివిక్రమ్ లైనప్ లో ఉన్న వెంకటేష్ తో సినిమా కూడా తీసే ఛాన్స్ ఉందని ఒక టాక్ నడుస్తుంది. మరి ఎవరి సినిమా ముందు వస్తుంది... డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తారన్నది చూడాలి.





















