Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
గోదావరి సీరియల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో సూపర్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ 'జాహ్నవి' పాత్రలో నటిస్తూ తన క్యూట్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న బ్యూటీ అనుమిత దత్తా. అక్టోబర్ 9, 2002న కోల్‌కతాలో అనుమిత దత్తా జన్మించింది. కన్నడ, బెంగాలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఫ్రీలాన్స్ మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసి, 2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా నటనలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగానే తాను మధ్యలోనే చదువు ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాల్సి వచ్చిందని అనుమిత ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది.
'పడమటి సంధ్యారాగం' సీరియల్‌లో 'ఆద్య' పాత్రతో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది అనుమిత. ఆ తర్వాత 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లో మిథున పాత్రలో పక్కా తెలుగింటి అమ్మాయిలా మెప్పించింది. భాష రాకపోయినా ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్‌ను చాలా సహజంగా పలికించడం ఈమె ప్లస్ పాయింట్.
ప్రస్తుతం 'గోదావరి' సీరియల్ సక్సెస్‌తో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. అందుకే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట. ఈ సీరియల్‌లో ఒక్కో రోజుకు దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ట్రెండీ రీల్స్ చేస్తూ అనుమిత ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















