Dil Raju Wife in Dil Raju Dreams Event | నవ్వు ఆపుకోలేక పోయిన దిల్ రాజు భార్య
ప్రొడ్యూసర్ దిల్ రాజు తాగాజా దిల్ రాజు డ్రీమ్స్ అనే కొత్త కంపెనీని మొదలు పెట్టారు. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న కొత్తవాళ్లకి అవకాశం కల్పించాడనికే ఈ దిల్ రాజు డ్రీమ్స్ ని మొదలు పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ ఈవెంట్ కి హీరో విజయ్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గెస్ట్ గా హాజరయ్యారు. సినిమా అనేది అట్రాక్షన్ మాత్రమే అని.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఒకే పర్సెంట్ ఉంటుందంటూ అక్కడున్న యూత్ కి ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇప్పుడు ఉన్న వాళ్లకి సినిమాని ఎలా తీయాలో.. ఎలా రిలీజ్ చేయాలో కూడా సర్రిగా తెలియక డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారని అన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ ఈవెంట్ లో తాను ఈ దిల్ రాజు డ్రీమ్స్ పెట్టడానికి గల కారణాలని అక్కడున్న యూత్ కి వివరించారు. సినిమా తీసి సక్సెస్ అవ్వాలంటే రోజు మొత్తం సక్సెస్ వచ్చే వరకు కష్టపడాలని.. అప్పుడే అనుకున్న గోల్ రీచ్ అవుతామని ప్రొడ్యూసర్ దిల్ రాజు. అయితే పుష్ప సినిమాలో తన పాటని హాలీవుడ్ లో కాపీ కొట్టినట్టు చెప్పుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.




















