War 2 Trailer Review Telugu | వార్ 2 ట్రైలర్ రివ్యూ | ABP Desam
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా వార్ 2. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసారు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. YRF స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ యుద్ధంలో ఎవరి పక్షం వహించడం అంత సులభం కాదు అంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు ఈ సినిమా హీరోలు. యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి, ప్రేమ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. హీరోలు ఇద్దరు దేశం కోసమే తమ పోరాటం చేస్తునట్టుగా కనిపిస్తుంది. దాంతో ఎవరు విల్లన్ ఎవరు హీరో అన్నది కూడా తెలియట్లేదు. కల్నల్ లూత్రా పాత్రలో నటించిన అశుతోష్ రాణాతో హీరో కబీర్ అంటే హృతిక్ రౌషన్ మాట్లాడిన మాటలు ఈ ట్రైలర్ కు మరింత హైప్ ని ఇస్తున్నాయి. వార్‌లో టైగర్ ష్రాఫ్ నటించిన కెప్టెన్ ఖలీద్ రెహమానీ పాత్రను హృతిక్ ట్రైలర్‌లో గుర్తు చేసారు. అలాగే కియారా అద్వానీ తన అందాన్ని చూపిస్తూ లవర్ గర్ల్ గా కనిపించిన పోలీస్ ఆఫీసర్ గా నటించినట్టు తెలుస్తుంది. వార్ 2 ట్రైలర్ లో ఆసక్తిగా అనిపించే విషయం ... హృతిక్ కియారా మధ్య కెమిస్ట్రీ. మరి హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే భారీ ఒక ప్లేన్ పై వెళ్తున్నప్పుడు జరిగే ఫైట్, వాటర్ లో హృతిక్ ఎన్టీఆర్ మధ్య జరిగే బాంబ్ బ్లాస్ట్ ఇలా ఎన్నో రకాల ఫైట్స్ ని కూడా ట్రైలర్ లో చూపించారు. మోతంగా చెప్పాలంటే ఫుల్ పవర్ ప్యాకడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వార్ 2 మన ముందుకు రాబోతుంది.





















