RRR 2 SS Rajamouli Announced : చికాగోలో క్రేజీ అప్ డేట్ ఇచ్చిన జక్కన్న | ABP Desam
RRR తో బాక్సాఫీస్ షేక్ చేసిన జక్కన్న ఇప్పుడు వరల్డ్ టూర్ లో ఉన్నాడు. RRR ను ఆస్కార్ కు జనరల్ కేటగిరిలో సబ్మిట్ చేసిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమాను అనేక థియేటర్లలో విడుదల చేస్తూ అక్కడి ప్రేక్షకులకు తారక్, రామ్ చరణ్ ల ను చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ టీమ్ తో కలిసి జపాన్ లో సందడి చేసిన దర్శక ధీరుడు..ఇప్పుడు చికాగో పర్యటనలో ఉన్నారు. అక్కడ RRR ను స్పెషల్ స్క్రీనింగ్ చేస్తుండగా...ఆడియెన్స్ నుంచి ప్రత్యేక స్పందన లభిస్తోంది. చాలా చోట్ల సినిమాకు స్టాండింగ్ ఒవేషన్ లభిస్తోంది. రాజమౌళి స్టేజ్ కి పైగానే కంటిన్యూస్ క్లాప్స్ తో అప్రిషియేట్ చేస్తున్నారు. తనను ఇంతలా సపోర్ట్ హాలీవుడ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు రాజమౌళి ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. అదే RRR సీక్వెల్.





















