Elections 2024 Counting | EVM సీల్ అప్పటికే ఒపెన్ చేసిఉంటే ఏం చేస్తారు..? | ABP Desam
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేల్చేది కౌంటింగ్ కేంద్రాలు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను రేపు అధికారులు లెక్కించనున్నారు. అసలు ఓట్ల లెక్కింపులు జరిగే ఈ కేంద్రాల్లో ప్రక్రియ ఎలా ఉంటుంది..ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో జరిగిన ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని వెల్లడించారు. ఈ ఓటర్ల సంఖ్య G7 కూటమి దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన వివరించారు. కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
![KA Paul Fires on Chandrababu Naidu | చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ కేఏ పాల్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/79bc3afa8896a756f7555f0ae1cb26e31717769407575252_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![YS Jagan Will Come To Assembly or Not | వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/07/7f255a4e2329751bd72dd7f21da8ab591717765432612252_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Thopudurthi Prakash Reddy Interview | తోపుదుర్తి ప్రకాష్రెడ్డితో ఏబీపీ ఫేస్ టు ఫేస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/fc63c5010a2edebab39ed9decf388a261717684517413953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gorantla Madhav Face to Face With ABP | గోరంట్ల మాధవ్తో ఏబీపీ ఫేస్ టు ఫేస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/ce166bcd67547a1a7662749e8df799271717684150640953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sunkara Padmasree Fires on YS Sharmila | వైఎస్ షర్మిలపై సుంకర పద్మశ్రీ ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/0302316b70a0fbfe3c6b97452082c7311717682628157953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)