CM Jagan First reaction | ఎన్నికల్లో ఓటమి తర్వాత కారణాలు చెప్పిన సీఎం జగన్
ప్రతిపక్షాలను తిట్టొచ్చు కానీ మరీ వ్యక్తిగత దూషణలు..అమ్మనా బూతులు..కొడాలి నాని మాటలు వింటే చాలు ఈయన మంత్రి ఏంటి రా బాబు అని జనాలు తల పట్టుకున్నారు. మంత్రిగా కూడా అవకాశం ఇచ్చిన జగనన్నకు బూతులతో నోరేసుకుని పడితేనే రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అని ఫీలయ్యారేమో కొడాలి నాని మాటలతో వైసీపీకి భారీ డ్యామేజ్ చేశారు. అది ఎంతెలా ఉంటే టీడీపీలో ఉన్నా, వైసీపీకి వచ్చినా ఓటమి ఎరుగుని ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని పరాజయం చూడటమే కాదు..వైసీపీకి పడాల్సిన ఓట్లకు ఘోరంగా గండి కొట్టాడు.
మేడం రోజా గ్రేట్ పొలిటీషయన్. స్త్రీ సాధికారికతను బలంగా చాటుతూ నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ తరపున నిలిచిన నేత. అలాంటి రోజా గారు తిట్ల పురాణం ప్రజల్లో జుగుప్స కలిగించింది. తొలుత ఏపీఐఐసీ ఛైర్మన్ గా తర్వాత మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ ను మెప్పు పొందాలని ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత దూషణలకు దిగుతూ రోజా చేసిన రచ్చ ఆమె పాలిటే బూమరాంగ్ గా మారింది. దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భాను ప్రకాష్ మీద రెండోసారి పోటీ చేసిన రోజా..ఈసారి అనూహ్యంగా ఓటమి పాలవటమే కాదు వైసీపీ ఓట్ బ్యాంకుకు భారీగా డ్యామేజ్ చేశారు