కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
సినిమాలో భారీ రాబరీలు, చేజింగ్ సీన్‌లు చూస్తుంటే..భలే ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. అలా సినిమాల్లోనే కాదు. రియల్ లైఫ్‌లో కూడా అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటాయి. హరియాణాకి చెందిన గ్యాంగ్. కేరళలో దొంగతనం చేసింది. చివరకు తమిళనాడులో పట్టుబడింది. ఇలా మూడు రాష్ట్రాల పోలీసులను ఒక్క దగ్గరకి తీసుకొచ్చారు దోపిడీ దొంగలు. కేరళలోని త్రిసూర్‌లో ఆరుగురు దొంగలు పక్కా ప్లాన్‌తో SBI ATMలో చోరీ చేశారు. అక్కడి నుంచి తమిళనాడు పారిపోయారు. అప్పటికే తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. అక్కడ ఆ దొంగల కోసం కాపు కాశారు. కనపడిన వెంటనే అరెస్ట్ చేయాలని చుట్టు ముట్టగా...ఆ గ్యాంగ్ కాల్పులకు దిగింది. ఇటు పోలీసులు కూడా ఎదురు కాల్పులతో ప్రతిదాడి చేశారు. ఈ కాల్పుల్లో ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా...మరొకరు గాయపడ్డారు. ఓ పోలీస్‌కి కూడా గాయాలయ్యాయి. గ్యాంగ్‌లో మిగిలిన నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తేలిందేంటంటే...కేరళ, త్రిసూర్‌లో దాదాపు మూడు ATMలలో 65 లక్షల నగదుని కాజేసింది..ఈ దొంగల ముఠా. ఓ కార్‌లో ఈ డబ్బంతా దాచేసి..ఆ కార్‌నే కంటెయినర్‌లోకి ఎక్కించి ఎవరి కంటా పడకుండా..తమిళనాడుకి పరారయ్యారు.