Nellore Police: మావోయిస్ట్ సంస్మరణ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన మావోయిస్టు సునీల్ అలియాస్ రవి చత్తీస్ ఘడ్ అడవుల్లో ఇటీవల మృతిచెందాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామంలో కుటుంబ సభ్యులు మావోయిస్టు రవి సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామం లో భారీగా పోలీసులు మోహరించారు. కనీసం సంస్మరణ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు కూడా అనుమతించకుండా అడ్డుకోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా తమని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించడానికి బంధువులు కూడా పంపించకపోవడం పట్ల పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మానవత్వం మరిచి ఇలా వ్యవహరించడం దారుణం అంటున్నారు.





















