అన్వేషించండి

Srikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులు

సముద్రాన్నే నమ్ముకుని బతికే గంగపుత్రులకు పరిస్థితులు దినదినగండంగా ఉంటాయి. ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగించే చేపలవేట ఓ వైపు...బోట్లు తగలబడిపోయి నడిసంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మరోవైపు..మత్య్సకారుల జీవితాలు సముద్రంలోని అలల్లానే అస్థిరంగా ఊగిసలాడుతూ ఉంటాయి.

చేపలవేటకు వెళ్లే ముందు మత్స్యకారులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తే చాలు అనుకుంటారు. తుపానులు కలవరపెట్టకూడదని..అగ్నిప్రమాదాలు ప్రాణాలు బలితీసుకోకూడదని వారు మొక్కే మొక్కులు ఒకటి రెండూ కాదు. ఇటీవలి కాలంలో నడిసముద్రంలో బోట్లు తగలబడుతూ మత్స్యకారుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడుతున్న సందర్భాలు వారి అవస్థలకు అద్దం పడుతున్నాయి.

నేను ప్రయాణిస్తున్న ఈ మత్య్సకారులంతా శ్రీకాకుళం జిల్లా బందరువానిపేటకు చెందిన వారు. అనుకోని పరిస్థితుల్లో ప్రకృతికి ఎదురువెళ్తూ వీళ్లు పడే ఇబ్బందులను అడిగితే నన్నూ వీళ్లతో పాటు రమ్మన్నారు. వాళ్ల కష్టాలను, కన్నీళ్లను దగ్గర్నుండి చూసి అర్థం చేసుకోమని వాళ్లు అడిగారు.  ఉన్నపళంగా బోటుకు మంటలు అంటుకుని ప్రాణభయంతో వణికిపోయే సందర్భాలను గుర్తు చేసుకుంటే చాలు వాళ్ల ఆలోచనలు ఇంటి మీదకు మళ్లిపోతాయని..బతికి ప్రాణలతో బయటపడితే చాలు అనుకుంటామని చెబుతున్నారు. పక్కబోట్ల వాళ్లు వచ్చి కాపాడితే ప్రాణాలు దక్కించుకుని బతుకుజీవుడా సముద్రం మీద బతుకుతూ ఆకలిపోరాటం చేస్తున్నామని చెబుతున్నారు.

బోటులో ఉండే గ్యాస్ సిలిండర్లు లీకై..తుపానుకు పిడుగులు పడి కూడా బోట్లలో మంటలు వస్తుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు.  సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకని పరిస్థితుల్లో తమకు ఏం జరిగిందో కూడా కుటుంబాలకు చెప్పే వారు ఉండరు. ప్రభుత్వం ఇలా దురదృష్టవశాత్తు మరణించే మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు.

విశాఖపట్నం వీడియోలు

గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులు
గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Embed widget