అన్వేషించండి
Advertisement
Heavy Rains Lash Vizag City: విశాఖలో కుంభవృష్టి, ప్రజలకు ఇక్కట్ల వరద
విశాఖలో కుంభవృష్టిగా వాన కురిసింది. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా నగరం అన్నివైపులా ఎడతెరిపి లేకుండా రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రానికి వాన తగ్గినా సరే.... నీటి నిల్వ చాలా ప్రాంతాల్లో దారుణంగా ఉంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాన్వెంట్ జంక్షన్, చావులమదుం, జ్ఞానాపురం వంటి ఏరియాల్లో అయితే.... నడిచి వెళ్లడానికి కూడా ప్రజలు చాలా కష్టపడుతున్నారు. మోకాలి లోతు దాకా నీరు వచ్చి చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర వాహనాల రాకపోకలను నిలిపివేశారు.ఆ దారంతా బ్లాక్ అయిపోయింది. జ్ఞానపురంలో విస్తృతంగా వర్షం కురవడంతో ఎర్రగడ్డ పొంగి వీధుల్లోకి మోకాలి లోతు నీరు వచ్చింది. ఇక వన్ టౌన్ ఏరియా, పాత పోస్టాఫీస్ ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion