TTD Elephants: తిరుమలలో ఘీంకారించిన గజరాజులు.. భయంతో పరుగులు తీసిన భక్తులు
ఘీంకారాలతో తిరుమల కొండ దద్దరిలింది. నవనీత సేవ ప్రారంభం సందర్బంగా గోశాల నుంచి ఏనుగులు శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరిన సమయంలో గోశాల నుంచి బయటకు రాగానే.. నందకం వద్ద వున్న డివైడర్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా భక్తులు వచ్చారు. ఇది చూసిన గజరాజులు బెదిరి..ఘీంకారించాయి. ఈ శబ్ధాలతో భక్తులు హడలిపొయ్యి పరుగులు తీశారు. ఏనుగులను నెమ్మదించేందుకు మావటీలు ప్రయత్నం చేసినా.. అదుపులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది సహాయంతో ఏనుగులకు మావటీలు గొలుసులు వేసి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఊరేగింపు ముగిసి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నప్పటికీ ఏనుగులు ఘీంకారాలు చెయ్యడంతో మావటీలు.. ఏనుగులను నెమ్మదిగా గోశాలకు తరలించారు.





















