Srikakulam Pen Hospital: ఐదు దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసుకున్న ఆసుపత్రి. | ABP Desam
శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి సమీపంలో ఉంది ఈ వినూత్న పెన్ ఆసుపత్రి. పొట్నూరి రాజారావు, ఆనందరావు సోదరులు 1975లో ఈ పెన్ ఆసుపత్రి ని తెరిచారు. ఇంకు, జెల్, బాల్ పాయింట్ పెన్నులకు ఇక్కడ మరమ్మతులు చేస్తారు. దీని కోసం ఆకురాయి, సానబెట్టే రాయి, నీళ్లు, బ్లేడు, ఇంకు ఉపయోగిస్తారు. రకరకాల పెన్నులూ విక్రయిస్తారు. విదేశాల నుంచి ఖరీదైన కలాలు తీసుకొస్తారు. పెన్ సర్వీస్ పూర్తిగా ఉచితం.పెన్ హాస్పిటల్ అనే సంస్థకు ఒక గుడ్‌విల్ రావాలని, పెన్ అంటే ఏంటో ఈ ఊరి నుంచి విలువ తెలియాలనేదే మా తపన. ఇంక్ పెన్ వాడాలంటే మాత్రం రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే కడగాలి. ఇప్పుడు కస్టమర్లలో ఓపిక, సహనం ఎవరికి లేదు కాబట్టి అది మన షాప్‌కు వస్తుంది అంటున్నారు పెన్ హాస్పిటల్ యజమానులు.





















