AP Minister List From Rayalaseema | బాబు టీమ్‌లో రాయలసీమ నుంచి ఆ 8 మందే ఎందుకు..?
ఏపీలో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. చంద్రబాబు నాయకత్వంలో జనసేన, బీజేపీ మిత్రపక్షాలను కలుపుకుంటూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. రాయలసీమ నుంచి 8 మందికి చోటు దక్కింది. ఆ 8 మందికే ఎందుకు చోటు కల్పించారు..? పరిటాల, జేసీ కుటుంబాలకు ఎందుకు చోటు ఇవ్వలేదు..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి..!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేన పార్టీ మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి, 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి జిల్లాలవారీగా లెక్క చూస్తే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రి పదవులు దక్కాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం దక్కలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అయితే ఈ సారి అనూహ్యంగా శాసనమండలి నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు.