అన్వేషించండి
Nellore: నెల్లూరు నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు... ఎందుకంటే..?
ప్లాస్టిక్ భూతంపై నెల్లూరు జిల్లా యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు నగరం నుంచి ప్లాస్టిక్ ని తరిమేయాలని నిర్ణయించారు నేతలు, అధికారులు. దీనిపై అవగాహన కల్పించడంలో భాగంగా ఒకరోజులో చెత్తబుట్టల్లోకి పోయే ప్లాస్టిక్ పదార్థాలన్నిటినీ నగరం నడిబొడ్డున కుప్పగా పోశారు. మొత్తం 15 టన్నుల ప్లాస్టిక్ అది. క్యారీ బ్యాగ్ లు, వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు అన్నీ వీటిలో ఉన్నాయి. వీటన్నిటిని నగరం నడిబొడ్డున ఉంచి అవగాహన కల్పించారు. ప్రతి రోజూ నెల్లూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ చెత్తబుట్టల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు.
వ్యూ మోర్





















