Minister Ramanaidu Pattiseema Lift Irrigation | పట్టిసీమ ఎత్తిపోతల పథకం
ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పూజలు నిర్వహించి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం తాడిపూడి ఎత్తిపోతల జలాలను విడుదల చేశారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా మళ్లింపు ప్రారంభించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పురుషోత్తపట్నం నుంచి కూడా గోదావరి జలాలను విడుదల చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పంపులు రిపేర్ లోనే ఉండేవని, ఇప్పుడు వాటిని మంచి కండిషన్ లో పెట్టి పట్టిసీమను ప్రారంభించామని అన్నారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అలాగే ముందు చూపుతో పని చేస్తూ.. నీరును ఆఖరి ఎకరానికి వెళ్లే విందంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు కూడా పాల్గొన్నారు.





















