రాజమండ్రిలో చిరుతపులి సంచారం, భయాందోళనలో స్థానికులు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. రాజమండ్రి దివాన్‌చెరువు సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు లాలాచెరువు, దివాన్‌చెరువు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి డీఎఫ్‌వో ఎస్.భరణి మీడియా సమావేశం నిర్వహించారు. దివాన్‌చెరువు సమీప ప్రాంతంలో లభ్యమైన పాదముద్రలను బట్టి ఇక్కడ సంచరించింది చిరుతపులి అని నిర్ధారణ చేశామన్నారు. సాయంత్రం ఆరు తర్వాత బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు. రాజమండ్రి దివాన్‌చెరువు సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు లాలాచెరువు, దివాన్‌చెరువు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి డీఎఫ్‌వో ఎస్.భరణి మీడియా సమావేశం నిర్వహించి దివాన్‌చెరువు సమీప ప్రాంతంలో లభ్యమైన పాదముద్రలను బట్టి ఇక్కడ సంచరించింది చిరుతపులిగా నిర్ధారణచేసినట్లు డీఎఫ్‌వో భరణి దృవీకరించారు. రాజమండ్రి దివాన్‌చెరువు, లాలాచెరువు సమీపప్రాంతాల్లోని ముఖ్యంగా స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూప నగర్, శ్రీరామ్‌నగర్, తారకరామానగర్, ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. తప్పకుండా ఈప్రదేశాల్లో చిరుత సంచరిస్తుందన్నారు. ఎవ్వరూ ఆరుబయట కూర్చొవద్దని, బయటకు రావాల్సి వస్తే వెంట టార్చ్‌లైట్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు.