Kappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP Desam
కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్థులు స్వీయనిర్బంధం చేసుకున్నారు. గ్రామంలోనికి వచ్చే రోడ్డు కు అడ్డంగా రాళ్లు ఏర్పాటు చేసిన గ్రామస్థులు.. యురేనియం తవ్వకాలు ప్రభుత్వం చేపట్ట రాదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఫలితంగా బళ్లారి- కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూడా పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆందోళనలను కొద్ది రోజులుగా ఉద్ధృతం చేశారు కప్పట్రాళ్ల గ్రామస్థులు.
యురేనియం తవ్వకాలు కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో గ్రామస్థులు స్వీయనిర్బంధం చేసుకున్నారు, ఎవరు రాకుండా గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. గ్రామంలోకి వచ్చే రోడ్డుకు అడ్డంగా రాళ్లు ఏర్పాటు చేసి, యురేనియం తవ్వకాలు ప్రభుత్వం చేపట్టకూడదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఫలితంగా బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలకు మద్దతుగా ధర్నాలో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూడా పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కప్పట్రాళ్ల గ్రామస్థులు కొద్ది రోజులుగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు.