(Source: ECI | ABP NEWS)
Kakinada Special Expandable Car | కాకినాడలో అందరినీ ఆకర్షిస్తున్న ఎక్స్ ప్యాడంబుల్ కారు | ABP Desam
మనం సాధారణంగా ఇళ్లల్లో ఎక్సాండబుల్ టేబుల్స్, ఛైర్స్, కాట్స్ చూస్తుంటాం కదా.. వీటి వినియోగం కూగా ఇటీవల కాలంలో బాగా పెరిగిందనే చెప్పవచ్చు.. ఎందుకుంటే ఇరుకు ఇళ్లల్లో ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.. కావాల్సినప్పుడు వాటిని విస్తరించుకోవచ్చు.. లేక పోతే మడిచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు ఓ ఆవిష్కణ చేశాడు.. ఇతని ఆలోచనకు ప్రధానంగా సామాజిక అవసరం కూడా ఉందని గ్రహించి ఆదిశగా అడుగులు వేశాడు.. ఆ కుర్రాడే కాకినాడకు చెందిన సుధీర్.. సుధీర్ గ్రాడ్యుయేషన్(బీకాం) పూర్తిచేసినప్పటికీ ఇంజనీరింగ్ విభాగం అంటే అత్యంత ఆశక్తితో ఆరంగంలోనే ఏదో ఒకటి చేయాలని తన ఆలోచనతో తనకు మించిన వ్యయప్రయాసలతో చాలా వరకు అనుకున్న ఆవిష్కరణకు కొంత వరకు రూపాన్ని తేగలిగాడు.. తల్లిని కోల్పోయి తండ్రి సంరక్షణలో ఉన్న ఈ యువకుడు తనకు ఇంకొంత డబ్బు, టెక్నాలజీ తోడైతే పూర్తిగా తన ఆవిష్కరణ లక్ష్యాన్ని ఛేదిస్తానని చెబుతున్నాడు.. ఇంతకీ ఈ యువకుడు ఏం చేశాడో ఆ ఆవిష్కరణ ఏంటో చూడాలంటూ ఈ స్టోరీ చదవాల్సిందే..
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇరుకు రోడ్లులోకి అంబులెన్స్‌లు, ఫైర్ వెహికల్స్(అగ్నిమాపక శకటం)లు చేరుకునేందుకు అనేక అవరోధాలు ఎదురవుతుంటాయి.. ఆ సమయంలో ఆ రోడ్డుకు దగ్గట్టుగా ఆ వెహికల్ అడ్జస్ట్ అవ్వగలిగితే... అదేవిధంగా ట్రాఫిక్‌లు జామ్ అయినప్పడు..పక్క సందులోనుంచి వెహికల్ వెళ్లిపోయేలా అడ్జస్ట్ అవ్వగలిగితే.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ ఆవిష్కరణకు అడుగులు వేశాడు.





















