తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ప్రాశస్త్యం ఏంటి..?
ఆపదమొక్కుల వాడు... అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు... తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఇల వైకుంఠంలో జరిగే మహత్కార్యం. ఆ ఉత్సవాలను కనులారా చూసినా... మనసారా స్మరించినా కలిగే అలౌకిక అనుభూతి అనిర్వచనీయం. అంతటి కమనీయమైన వైభవోత్సవాల వేళ....శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయ్యప్ప స్వామి రోజుకో వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలను నాంది అంకురార్పణతో జరిగితే...సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మే ముందుండి ఈ వేడుకలను జరిపిస్తారని ప్రతీతి. అంకురార్పణ జరిగిన మరుసటి రోజు సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అసలేంటి ధ్వజారోహణం అంటే..?





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

