CM Chandrababu Fires on TDP MLAs | సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే చంద్రబాబుకు ఎందుకు కోపం వచ్చింది.?
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ముఖ్య నేతలకు పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, పాలనా లక్ష్యాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాలని ఆయన భావించారు. అయితే, కీలకమైన ఈ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. పార్టీకి ఎంతటి ప్రాధాన్యత ఉన్న సందర్భంలోనూ ఇలా గైర్హాజరవడం చంద్రబాబును అసహనానికి గురిచేసింది.
సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై ఆయన మండిపడ్డారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి ఏడాది పూర్తి కావడం, ప్రజల అంచనాలను తీర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో పార్టీ నేతల నిర్లక్ష్యం ఆయనను తీవ్రంగా నిరాశపరిచినట్లు తెలిసింది. కొన్ని మంది ఎమ్మెల్యేలు ప్రోగ్రామ్ ఉన్నట్లు ముందుగానే తెలియజేయగా, మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డుమ్మా కొట్టారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం వీరి హాజరును పర్యవేక్షించి, ఇటువంటి వ్యవహారాలపై కఠినంగా స్పందించే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు పార్టీ నాయకత్వం ఇచ్చే ఆదేశాలను గౌరవించాల్సిన అవసరం ఎంతయినా ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.





















