బిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్
వైఎస్ఆర్ సీపీ హాయాంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ ఓ చర్చి ట్రెజరర్‌ను బెదిరించిన కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి ముగిశాక మెడికల్ టెస్టులకు హాస్పిటల్ కు వచ్చిన ఆయన స్పందించారు. అయితే, పోలీస్ కస్టడీలో తనకు బిర్యానీ తినాలని ఉందని.. తెప్పించాలని కోరారు. కనీసం ఇంటి నుంచైనా ఆహారం తెప్పించాలని కోరారు. అయితే, ఆయన డిమాండ్‌కు పోలీసులు ఒప్పుకోలేదు. మామూలు మెస్ నుంచి భోజనం తెప్పించారు. అయితే, అక్టోబర్ 29న బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు బోరుగడ్డ పోలీసుల తీరుపైన కూడా ఫిర్యాదు చేశారు. ‘‘నాకు మట్టి గడ్డలు, రాళ్లు ఉన్న అన్నం పెట్టారని చెప్పారు. దీనికి న్యాయాధికారి స్పందిస్తూ మేం కూడా తినేది కూడా అదే ఫుడ్ అని అనడంతో అనిల్ సైలెంట్ అయిపోయారు. న్యాయాధికారి మళ్లీ రిమాండ్ విధించడంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.