అన్వేషించండి
రైతులు ముందు కదలగా అనుసరించిన దేవుడి రథాలు
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలకు రెండు రోజులపాటు విరామం ఇచ్చిన రైతులు మంగళవారం నుంచి యాత్రను తిరిగి మొదలు పెట్టారు. మంగళవారం యాత్ర మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురయ్యాయి. దేవుడి రథాలను యాత్రలో ముందుకు కదలనీయమంటూ పోలీసులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతలు కూడా పోలీసులతో మాట్లాడినా ఫలితం లేదు. చివరకు రైతులు ముందు కదలగా ఆ తర్వాత దేవుడి రథాలు వెనక అనుసరించాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి




















