(Source: ECI/ABP News/ABP Majha)
ఉడ్‌బీ సీఎం అని లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబు
‘‘ఉడ్ బి ముఖ్యమంత్రిని అని ప్రచారం చేసుకుంటూ నారా లోకేశ్ నాటకం ఆడిస్తున్నాడు. హోం మంత్రి అనిత మైకుకు మాత్రమే పరిమితం. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. మీ కుట్రలు, కుతంత్రాలపై న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడుతాం. అరెస్టుల నాటకం వెనుక సూత్రధారి నారా లోకేష్’’ అని గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలయ్యిందని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని రాంబాబు అన్నారు. చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారని, టీడీపీ అనుకూల పేజీల్లో వైఎస్ జగన్‌పై పరుషపదజాలంతో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే సైకో ఎవరనేది ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. టీడీపీ అనుకూల పోస్టులు చూపిస్తూ ఇదేనా భావ స్వేచ్ఛా అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ల మీద కేసులు పెట్టరా అని అంబటి నిలదీశారు.