Worlds Expensive Mango: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి, రాయ్‌పూర్ మ్యాంగో ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా మియాజాకి
Worlds Expensive Mango: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకాన్ని ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్ లో నిర్వహించిన మ్యాంగో ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
Worlds Expensive Mango: ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ లో నిర్వహించిన మ్యాంగో ఫెస్టివల్ లో జపాన్ కు చెందిన ప్రసిద్ధ మామిడి రకం మియాజాకి రకాన్ని ప్రదర్శించారు. ఈ మియాజాకి మామిడి ధర కిలో రూ.2.80 లక్షలు ఉంటుందని మ్యాంగో ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. ఈ మామిడిని ఎగ్ ఆఫ్ సన్‌షైన్ అని కూడా పిలుస్తుంటారు. జపాన్ లోని మియాజాకి వద్ద ఈ రకం మామిడి పండ్లను పండించడంతో వీటికా ఆ పేరు వచ్చింది.
మియాజాకి ఎందుకంత ప్రత్యేకమైనది?
మియాజాకి మామిడి ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ మామిడి పండ్లను తినడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట. జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, కె వంటి పోషకాలు మియాజాకి మామిడిలో పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి అవసరమైన కాపర్, మెగ్నీషియం వంటి మూలకాలు కూడా ఉంటాయి. మలబద్ధకం, అజీర్ణం లేదా ఇతర కడుపు సంబంధిత సమస్యలను ఈ మియాజాకి మామిడి సులభంగా తగ్గిస్తుంది. వేసవిలో మియాజాకి మామిడి తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు.
డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ మియాజాకి మామిడి రకం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మామిడి తీసుకుంటే ఒంట్లో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే మియాజాకి మామిడి ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. వేసవిలో ఈ మామిడి తింటే.. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని సాధారణంగా ఉంచుతుంది.
కొవ్వు కరిగిస్తుంది
ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి మియాజాకి మామిడిలోని పోషకాలు పని చేస్తాయి. అధిక కొవ్వు వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగక స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం మియాజాకి మామిడి ఉంటుందని అంటారు.
చర్మ సౌందర్యానికి మియాజాకి
మియాజాకి మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రకం మామిడి తింటే మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ముఖంపై దుమ్ము ధూళితో ఏర్పడే మొటిమలను కూడా ఇది తొలగిస్తుంది. చర్మాన్ని తేమను అందించి కాంతివంతంగా ఉంచుతుంది.
Also Read: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర్ తలుపులను ఎప్పుడు తెరుస్తారంటే?
మియాజాకి మామిడిని కుండీల్లో పెంచుతారు
మియాజాకి మామిడిని జపాన్ లో కుండీల్లో పెంచుతారు. ఈ మొక్కలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కుండీల్లో నాలుగైదు ఫీట్ల ఎత్తు పెరగ్గానే పూతకు వస్తాయి. కాయలు కాయడం మొదలవుతుంది. అయితే ఈ కాయలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నేలకు తక్కువ ఎత్తులోనే ఈ కాయలు కాస్తుంటాయి. అందుకే చెడిపోయే అవకాశాలు ఎక్కువ. ఈ రకం మామిడి పండ్లు ఎక్కువగా జపాన్ లోనే లభిస్తుంటాయి. అయితే గతేడాది కాకినాడలో ఓ రైతు ప్రయోగాత్మకంగా ఈ మియాజాకీ మామిడి చెట్లను నాటాడు. సేంద్రీయ ఎరువులు మాత్రమే వేసి మియాజాకీ మామిడిని పెంచాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు.
World's most expensive mango 'Miyazaki' showcased at Raipur Mango Festival
— ANI Digital (@ani_digital) June 20, 2023
Read @ANI Story | https://t.co/fTKTXFToje#Miyazaki #Mango #Raipur #MangoFestival pic.twitter.com/J9Ppz1Kqmv
Join Us on Telegram: https://t.me/abpdesamofficial