Largest Car: ప్రపంచంలోనే అతి పెద్ద కారు ఇది, ఇందులో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టేయొచ్చు!
ఇది సాదా సీదా కారు కాదు. చాలా పే.......ద్ద కార్. ఈ కారులో ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. సీట్లు పీకేసి ఇల్లు కూడా కట్టేయొచ్చు. మరి, లోపల ఎలా ఉందో చూసేయండి.
![Largest Car: ప్రపంచంలోనే అతి పెద్ద కారు ఇది, ఇందులో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టేయొచ్చు! World’s largest Hummer H1, it takes a ladder to climb it Largest Car: ప్రపంచంలోనే అతి పెద్ద కారు ఇది, ఇందులో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టేయొచ్చు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/21/22cde078b4560c23fdd20d357a4f3bff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కార్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పుడు బుల్లి కార్లతో ఆడుకొనే మనం వయస్సు పెరిగాక పెద్ద కార్లపై మనసు మల్లుతుంది. కనీసం ఒక్కసారైనా డ్రైవ్ చేసి సరదా తీర్చుకోవాలని ఉంటుంది. కారు నడపడం ఒక్కసారి అలవాటైందంటే చాలు.. రకరకాల కార్లను నడపాలనే కోరిక పుడుతుంది. ఈ కారును చూసిన తర్వాత.. ఆ కోరిక మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కారు(Hummer). దీని ముందు మీ పెద్దకారు కూడా టాయ్ కారులా కనిపిస్తుంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఈ ఫొటోలు, వీడియోలు చూడాల్సిందే.
Also Read: ‘ఏక్ మినీ కథ’ - ఇండియాలో అందరిదీ ఇదే కథా? ఆ ‘సైజు’పై ఈ సర్వే వివరాలు నమ్మొచ్చా?
సాధారణ హమ్మర్(Hummer) ఎస్‌యూవీ కారు చూస్తే వామ్మో, ఇంత ఉందేంటి అనిపిస్తుంది. అలాంటిది.. దానికి మూడింతలు పెద్దదైనా ఈ H1 X3 కారును చూస్తే తప్పకుండా కళ్లు తిరుగుతాయ్. 6.6 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు (21.6 x 46 x 19.6 అడుగులు). దీని యజమాని హమద్ బిన్ హహ్దాన్ అల్ నహ్యాన్ (రైన్‌బో షేక్) ఈ కారు గురించి చెబుతూ.. ఇది ఆఫ్‌రోడ్‌లో కూడా వేగంగా దూసుకెళ్తుందని తెలిపాడు. తనవద్ద ప్రపంచంలోనే అతి పెద్ద ఎస్‌యూవీ కారు కూడా ఉందని పేర్కొన్నాడు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)