అన్వేషించండి

Viral News:స్నానానికి 26 నిమిషాలు ప‌డుతోందని భ‌ర్త తిడుతున్నాడు- వైరల్‌గా మారిన ఓ ఇల్లాల్లి వేదన

Social Media: భార్య స్నానం పేరుతో నీటిని వృథా చేస్తుంద‌ని భ‌ర్త చేస్తున్న కంప్లైంట్‌తో విసిగిపోయిన భార్య‌.. రెడ్ఇట్‌లో త‌న బాధ‌ను పోస్టు చేసింది. అదిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

Women Social Media Post Viral: స్నానం చేసే పేరుతో తాను నీటిని వృథా చేస్తున్నానంటూ భ‌ర్త త‌న‌ని మాట‌ల‌తో వేధిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ మ‌హిళ రాసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. రెడ్ఇట్‌లో రాసిన ఈ పోస్టుపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే 10 వేల మంది వ‌ర‌కు చూసి స్పందించారు. 

3-4 రోజుల‌కు ఒక‌సారే స్నానం..

ఒక మ‌హిళ త‌న‌కు స్నానం చేయ‌డానికి 26 నిమిషాలు స‌మ‌యం ప‌డుతోంద‌ని రెడ్ఇట్ పోస్టులో రాసుకొచ్చింది. ఫేస్ వాష్‌, బాడీ వాష్‌, హెయిర్ వాష్, షాంపూ, షేవింగ్‌.. ఇలాంటి అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌డానికి త‌న‌కు 26 నిమిషాలు ప‌డుతోంద‌ని రాసింది. అయితే తాను స్నానం పేరుతో నీటిని వృథా చేస్తున్నాన‌ని త‌న భ‌ర్త నిత్యం కంప్లైంట్ చేస్తున్నాడ‌ని వాపోయింది. అలాగ‌ని తాను రోజూ కూడా స్నానం చేయ‌న‌ని చెప్ప‌డం విశేషం. తానొక వ‌ర్కింగ్ ఉమెన్‌న‌ని చెబుతూనే రోజూ ఇంటి నుంచే ప‌నిచేస్తున్న‌ట్టు రాసింది. అప్ప‌టికీ తాన‌ను మూడు నాలుగు రోజుల‌కొక‌సారి మాత్ర‌మే స్నానం చేస్తున్నా, నీటి వృథా గురించి త‌న‌ను భ‌ర్త నిందించ‌డంపై వాపోతుంది. తనకు ఒత్తైన మంద‌పాటి పొడ‌వాటి జుట్టు ఉంద‌ని, స్నానం చేయ‌డానికి ఆ మాత్రం స‌మ‌యం కూడా ప‌ట్టదా అంటూ బాధ‌ప‌డింది. 

ప్లే లిస్ట్‌తో టైం చెక్ చేశా..

త‌న భ‌ర్త కంప్లైంట్‌పై తాను కూడా సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్టు ఆ మ‌హిళ పేర్కొంది. తాను స్నానానికి ఎంత స‌మ‌యం తీసుకుంటున్నానో తెలుసుకోవ‌డానికి ఒక ప్ర‌య‌త్నం కూడా చేశానంది. స్నానానికి వెళ్లే ముందు ప్లే లిస్ట్ ఆన్ చేసి వెళ్లి, తిరిగి బాత్రూం నుంచి బ‌య‌ట‌కొచ్చాక చూస్తే 26 నిమిషాలు ప‌ట్టింద‌ని చెప్పింది. అది కేవ‌లం బాడీ బాతింగ్ కాద‌ని, హెయిర్ వాష్‌, ఫేష్ వాష్‌, బాడీ వాష్, హెయిర్ కండిష‌నింగ్.. వీటితోపాటు షేవింగ్ కోసం 26 నిమిషాలు కూడా ప‌ట్ట‌దా అని ప్ర‌శ్నించింది. ఒత్తైన పొడ‌వాటి జుట్టున్న మ‌హిళ‌ల‌కు ఆ మాత్రం స‌మ‌యం తీసుకోవ‌డం ఓ త‌ప్పేముంద‌ని ఆమె భావ‌న‌.  నార్మ‌ల్ బాడీ వాష్‌, హెయిర్ షాంపూ చేసుకోవడానికి త‌న‌కు ప‌ది నిమిషాలే ప‌డుతోంద‌ని చెప్పింది.  ఇవ‌న్నీ ఆలోచించ‌ని త‌న భ‌ర్త త‌న‌కు పోటీగా నేను స్నానానికి బాత్రూంలోకి వెళ్లిన‌ప్పుడు సింక్‌లో ట్యాప్ ఆన్ చేసి బ‌య‌ట‌కొచ్చిన‌ప్పుడు ఆపుతున్నాడ‌ని చెప్పింది. అంటే, నాతోపాటే తాను కూడా నీటిని వృథా చేస్తున్నాన‌ని చెప్ప‌డం త‌న ఆలోచ‌న అంటోంది. వాట‌ర్ బిల్లుకు భ‌య‌ప‌డి త్వ‌ర‌గా వ‌చ్చేలా చేయాల‌నేది త‌న ప్లాన్ అని మ‌హిళ త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చింది.

Also Read: బాధ్యతలన్నీ తీరిపోయాయి - ముకేష్ , నీతా అంబానీల రిలాక్స్‌డ్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?

నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..

మ‌హిళ పోస్టుకు ఇప్ప‌టికే 10 వేల మంది వ‌ర‌కు చూశారు. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. స్నానం చేయ‌డానికి త‌మ‌కు ఎంత స‌మ‌యం ప‌డుతుందో వివ‌రిస్తున్నారు. భార్య స్నానం చేస్తుంటే నీటిని వృథా చేస్తుంద‌ని చెప్ప‌డ‌మా..వ‌రెస్ట్  అంటూ ఒక వ్య‌క్తి మండిప‌డ్డాడు. మ‌రో వ్య‌క్తి తాను ఇలా చేయ‌డం క‌రెక్ట్ అని ఎలా భావిస్తున్నాడో త‌న‌కి అర్థం కావ‌డం లేద‌ని కామెంట్ చేశాడు. మ‌రో వ్య‌క్తి తాను స్నానం, షేవింగ్‌, హెయిర్ వాష్‌.. అన్నింటికీ క‌లిపి ముప్పావు గంట నుంచి గంట వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పాడు. కేవ‌లం నార్మ‌ల్ ష‌వ‌ర్ కోస‌మే తాను పావు గంట నుంచి అర గంట స‌మ‌యం తీసుకుంటాన‌ని చెబుతున్నాడు. 

మ‌రో వ్య‌క్తి ఇలా రాసుకొచ్చాడు.. కేవ‌లం బాడీ వాష్‌కే 10 నుంచి 15 నిమిషాలు ప‌డుతుంది. హెయిర్ షాంపూ కండిష‌నింగ్ చేసుకుంటే 25 నుంచి 30 నిమిషాలు ప‌డుతుంది. ఇక షేవింగ్ కూడా క‌లిపితే క‌నీసం 45 నిమిషాలు ప‌ట్ట‌డం కామ‌న్ అని తేల్చేశాడు. మ‌రో వ్య‌క్తి.. `నాకు పొడ‌వాటి ఒత్తైన రింగుల జుట్టు ఉంది. నాకు షేవింగ్ చేసుకోకుండానే స్నానానికి క‌నీసం 30 నిమిషాలు ప‌డుతుంది` అని చెప్పాడు. మ‌రో వ్య‌క్తి మాత్రం నీకు గుణ‌పాఠం చెప్పడానికి మీ భ‌ర్త కావాల‌నే ఇలాంటి ప‌నులు చేస్తున్నాడ‌ని హితోక్తులు చెప్పాడు.

Also Read: ఏం చేయ‌కుండానే అమెజాన్‌లో రూ. 3 కోట్లు జీతం, సోషల్ మీడియాలో రచ్చరచ్చ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget