(Source: ECI/ABP News/ABP Majha)
Mukesh Ambani : బాధ్యతలన్నీ తీరిపోయాయి - ముకేష్ , నీతా అంబానీల రిలాక్స్‌డ్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?
Nita and Mukesh Ambani : ప్రపంచ కుబేరుల్లో ఒకరయిన ముఖేష్ అంబానీ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. ఎలా అంటే.. సతీమణితో కలిసి రోడ్డుపై నడుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Nita and Mukesh Ambani seen enjoying quiet night stroll with minimal security : ముఖేష్ అంబానీ తన సతీమణి నీతా అంబనీతో కలిసి రోడ్డుపై అలా నడుచుకూంటూ..కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం ఎవరైనా చూసి ఉంటారా?. అంత తీరిక వారికి ఎక్కడ ఉంటుందని అనుకుంటారు. అది నిజమే. కానీ వారు ఇప్పుడు తీరిక చేసుకుని చిన్న చిన్న ఆనందాలను వెదుక్కుంటున్నారు. సాధారణంగా సతీమణితో కలిసి అలా వీధుల్లో వాకింగ్ కు వెళ్లి మాట్లాడుకుంటూ ఏదో ఓ స్ట్రీట్ ఫుడ్ తిని రావడం మధ్యతరగతి ప్రజలకు అలవాటు. అలాంటి చిన్న చిన్న ఆనందాన్ని ఇంత కాలం కోల్పోయానని అనుకున్నారేమో కానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇప్పుడు అదే చేస్తున్నారు.
పెద్దగా సెక్యూరిటీ లేకండా ముఖేష్, నీతా అంబానీ మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి ముంబైలో కాదు. స్విట్జర్లాండ్‌లో . అలా రాత్రి పూట వ్యాహ్యాళికి వెళ్లినట్లుగా వాకింగ్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
View this post on Instagram
అంబానీ కుటంబం తమ సెలవుల్ని .. యూరప్ లో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.తరచూ వారు స్విట్జర్లాండ్ కు ప్రయాణిస్తూంటారు. అక్కడి అత్యంత లగ్జరీ రిసార్టుల్లో గడుపుతూంటారని చెబుతూంటారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా సిట్జర్లాండ్ లోనే నిర్వహించారు.
ఇటీవల చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ బాధ్యతలన్నీ తిరిపోవడంతో రిలాక్స్ అవుతున్నారు. పిల్లలు చేతికి అంది రావడంతో రిలయన్స్ లో వారికి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు చైర్మన్ గా కీలక అంశాలనే చూస్తున్నారు. దీంతో కుటుంబంకోసం సమయం కేటాయించి సతీమణితో కలిసి సరదాగా గడుపుతున్నారని చెప్పుకుంటున్నారు.
ముకేష్ అంబానీ ఇప్పుడు ఆసియాలోని కుబేరుల్లో ఒకరు. రిలయన్స్ కంపెనీని ఓ స్థాయికి తీసుకెళ్లడానికి ఆయన దశాబ్దాల పాటు రేయింబవళ్లు కష్టపడ్డారు. కంపెనీలను ఉన్నత స్థానంలో ఉంచారు. ఇప్పుడు రిలయన్స్ తో పాటు జియో బ్రాండ్లు అతి విలువైన బ్రాండ్లుగా నిలిచాయి. అప్పులు లేని కార్పొరేట్ కంపెనీగా రిలయన్స్ మారింది.