అన్వేషించండి

Viral News: ఏం చేయ‌కుండానే అమెజాన్‌లో రూ. 3 కోట్లు జీతం, సోషల్ మీడియాలో రచ్చరచ్చ

Amazon News | ఏ ప‌ని చేయ‌కుండా ఏడాదిన్న‌ర‌లోనే అమెజాన్ నుంచి రూ. 3.10 కోట్లు జీతం తీసుకున్నాన‌ని ఓ ఉద్యోగి రాసిన పోస్ట్ సోష‌ల్ మీడియా లో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Amazon Employee Post Viral in Social Media ఏ ప‌నిచేయ‌కుండానే రూ. 3.10 కోట్లు ($370,000) జీతంగా తీసుకున్నాన‌ని ఓ ఉద్యోగి రాసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియా ఫ్లాట్ పాం Blind లో రాసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. అమెజాన్ ఉద్యోగి రాసిన ఆ పోస్టును స్క్రీన్ షాట్ తీసిన ఒక వ్య‌క్తి  X లో పోస్టు చేయ‌డంతో ఇప్పుడ‌ది X  లో వైర‌ల్ అవుతోంది.  తాను ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌లో ఏడాదిన్న‌ర కాలంగా ప‌నిచేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. లే ఆఫ్‌లో భాగంగా త‌న‌ను గూగుల్ సంస్థ ఉద్యోగంలో నుంచి తీసేసింద‌ని, దాంతో అమెజాన్‌లో చేరిన‌ట్టు చెప్పుకొచ్చాడు. 

ఏం చేయ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతోనే ఉద్యోగంలో చేరాడు

తాను అమెజాన్‌లో చేరిన ఏడాదిన్న‌ర కాలంలో కేవ‌లం 7 టాస్క్‌లు మాత్ర‌మే పూర్తి చేశాన‌ని చెప్పాడు. ఒకే ఒక్క ఆటోమేటెడ్ డ్యాష్‌బోర్డ్ క్రియేట చేసిన‌ట్టు చెప్పాడు. అయితే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్స్ (AI) చాట్ జీపీటీ chatbot ChatGPT ద్వారా వారం రోజుల్లో పూర్తి చేసే ఈ టాస్క్‌ను పూర్తి చేయ‌డానికి తాను మూడు నెల‌లు స‌మయం తీసుకున్నాన‌ని గొప్ప‌గా చెప్పుకొచ్చాడు. అస‌లింత‌కీ అత‌ను అమెజాన్‌లో చేరిన‌ప్పుడు ఏం అనుకున్నాడో తెలిస్తే షాక‌వుతారు. ఏ ప‌నిచేయ‌కుండా జీతం తీసుకోవాల‌నే ల‌క్ష్యంతోనే తాను అమెజాన్ సంస్థ‌లో చేరిన‌ట్టు చాలా గ‌ర్వంగా చెప్పుకోవ‌డం విశేషం. అలాంటి త‌న‌ను అమెజాన్ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ టీమ్‌లో చేర్చింద‌ని న‌వ్వుకున్నాడు. ఈ టీమ్‌లో స‌భ్యులుగా ఉన్న తామంతా ప‌నికి సంబంధించిన విష‌యాల‌ను చ‌ర్చించుకుంటామ‌ని రాశాడు. అయితే ఆఫీసులో త‌న వర్క్ చార్ట్‌పై ఆ ఉద్యోగి అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. వారంలో 8 గంట‌లు మీటింగుల‌తోనే స‌రిపోతుంద‌ని చెప్పాడు. 

భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్స్

ఆ పోస్టుపై ఉద్యోగులు, నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ఉద్యోగం ఇచ్చిన సంస్థ‌ను మోసం చేయ‌కూడ‌ద‌ని రిప్లై ఇస్తున్నారు. అస‌లే ఉద్యోగాలు రాక ఏడుస్తుంటే అంత భారీ జీతం తీసుకుంటూ కూడా అలా ఎలా చేశావ్ బ్రో అని కామెంట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రైతే నువ్వు సూప‌ర్ బ్రో అని జ‌వాబిస్తున్నారు. కొంద‌రేమో మా ఆఫీసులో కూడా కొంద‌రు ఎప్పుడూ బిజిగా ఉన్న‌ట్టు న‌టిస్తూ ఉంటారు కానీ, ఏ ప‌నీ చేయ‌ర‌ని త‌మ అనుభ‌వాల‌ను పంచుకుంటున్నారు. ఇలాంటి ఉద్యోగులు చేస్తున్న ఇలాంటి ప‌నుల కార‌ణంగా త‌మ లాంటి వారికి కూడా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏ గోల్ లేకుండా రోజంతా టైంపాస్ ఎలా చేస్తుంటార‌ని మ‌రో ఉద్యోగి అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఒక వ్య‌క్తి త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితాన్ని కార్పొరేట్ సంస్థ కోసం ప‌ణంగా పెట్ట‌కూడ‌ద‌ని ఒక‌రంటే, మ‌రొక‌రేమో రోజుకు 2 గంట‌లు మాత్ర‌మే ప‌ని చేస్తూ 8 గంట‌ల జీతం తీసుకోవ‌డానికి ఎలా మ‌న‌సొప్పుతుంద‌ని ఒకామె కామెంట్ చేసింది. 

Also Read: Dating App: డేటింగ్ యాప్‌ల‌తో రెస్టారెంట్ల ఘ‌రానా మోసం, తడిచి మోపడయ్యేంత బిల్లు!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget