అన్వేషించండి

Whiskey From 1860s: ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయాయి.. ఒక్క బాటిల్ రూ. కోటా!

మద్యం ఫుల్ బాటిల్ ధర అటూ ఇటుగా రూ. వెయ్యి, లేదంటే రూ. రెండు వేలు. ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ. 10 వేల వరకు ఉంటుంది. మరికొన్ని రూ. 10 లక్షల వరకూ ఉన్నాయి. కానీ ఈ మద్యం బాటిల్‌ అక్షరాలా కోటి రూపాయలు.

ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా వయసు పెరిగేకొద్ది వస్తువుల విలువ తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే తాగే లేక తినే వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ కూడా ఉంటుంది. కానీ వైన్ మాత్రం ఇందుకు భిన్నం. దాచేకొద్ది ఈ వైన్ విలువ పెరుగుతుంది. అయితే ఈ వైన్ విలువ వేలల్లో ఉంటేనే అమ్మో అంటాం. మరి అదే విస్కీ ధర కోట్లలో ఉంటే షాక్ అవ్వక తప్పదు కదా. అవును ఈ విస్కీ కథ వింటే మీరూ అవాక్కవుతారు.

ఇదేందిరా బాబు..

ప్రపంచంలోనే అత్యంత పాతదిగా భావిస్తున్న ఓ విస్కీ బాటిల్‌ను ఇటీవల వేలం వేశారు. అయితే ఈ విస్కీ పలికిన ధర తెలిస్తే షాక్‌ అవక తప్పదు. 250 ఏళ్ల నాటి ఆ బాటిల్‌ వేలంలో అక్షరాలా రూ.1 కోటి ధర పలికింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సీసాపై ఉన్న లేబుల్‌పై దాని వివరాలున్నాయి. దాని ప్రకారం అందులోని మద్యం బర్బన్‌ విస్కీగా గుర్తించినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు.

1860 నాటిదిగా భావిస్తున్న ఈ బాటిల్‌లోని మద్యం అప్పటికన్నా 100 ఏళ్ల పూర్వం నాటిదిగా  అంచనా వేస్తున్నారు. ఆ కాలంనాటి ప్రఖ్యాత సంపన్నుడు జేపీ మోర్గాన్‌ దీనిని సేకరించినట్లుగా చెబుతున్నారు. ఆయన మరణానంతరం, దక్షిణ కరోలినా గవర్నర్‌ జేమ్స్‌ బైర్నస్‌కు, అక్కడి నుంచి ఆ బాటిల్‌ స్కిన్నర్‌ ఇంక్‌ సంస్థకు చేరింది.

ఎవరు కొన్నారు..?

ఈ విస్కీ బాటిల్‌కు 20 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్ల ధర పలుకుతుందని స్కిన్నర్‌ ఇన్‌కార్పొరేషన్‌ సంస్థ అంచనా వేసింది. కానీ అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అది 1,37,500 డాలర్లకు అమ్ముడుపోయింది. అయితే అందులోని మద్యం 1763 నుంచి 1803 మధ్య కాలంలో తయారు చేసి ఉండవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బాటిల్‌ను మన్‌హట్టన్‌కు చెందిన 'ది మోర్గాన్‌ లైబ్రరీ' రూ. 1.02 కోట్లకు సొంతం చేసుకుంది. 

Whiskey From 1860s: ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయాయి.. ఒక్క బాటిల్ రూ. కోటా!

అయితే అంత ఖర్చు పెట్టి కొన్నప్పటికీ దీన్ని ఎవరూ తాగడానికి లేదట. ఈ విస్కీ బాటిల్ ను దాచుకోవడం తప్ప ఏం చేయలేరట. ఎందుకంటే మూత తీయకుండా ఎక్కువ కాలం ఉంచిన విస్కీ తాగడానికి పనిచేయదట. ఇదీ ఈ కోటి రూపాయల విస్కీ కథ. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఏళ్ల నాటి విస్కీల గురించి వార్తలు వచ్చాయి. అయితే ఇదే ఇప్పటివరకు వచ్చిన వాటిలో పురాతన విస్కీ అని తేలింది. దీని ధర వింటే తాగకుండానే కిక్కెక్కుతుంది. ఈ వార్త ఇప్పటికే నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget