Snake in Garden - వీడియో: కాళ్ల మధ్యలోకి పా పా పాము, గార్డెన్‌లో పని చేసుకుంటుంటే ఇలా అల్లరి చేసింది
మీకు పాములంటే భయమా? అయితే, గార్డెన్‌లో కూర్చొనేప్పుడు జాగ్రత్త. లేకపోతే మీకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురుకావచ్చు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? వాతావరణం బాగుంది కదా ఆరు బయట గార్డెన్‌లో కూర్చొని పని చేసుకుంటున్నారా? జాగ్రత్త, మీకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియా అంటేనే పాముల దేశం. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక జంతువులు, అత్యంత విషపూరితమైన పాములకు ఆస్ట్రేలియానే నిలయం. దీంతో అక్కడ చీమలు కనిపించినా, కనిపించకపోయినా.. నిత్యం పాములు మాత్రం కనిపిస్తుంటాయి. అక్కడి జనాలకు వాటిని చూసి చూసి బోరు కూడా కొట్టేసింది. కానీ, భయం మాత్రం పోలేదు. ఎందుకంటే అక్కడ పాము కనిపించడం ఎంత సాధారణమో, పాము కాటు వల్ల ప్రాణాలు పోవడం కూడా అంతే సాధారణం.
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. విక్టోరియాలోని ఒక వ్యక్తి ఇంటి బయట ట్యాబ్ ముందు కూర్చోని పనిలో నిమగ్నమైన సమయంలో ఓ పాము దారితప్పి అక్కడికి వచ్చింది. అయితే, దాన్ని ఆ వ్యక్తి గమనించలేదు. తన పనిలో తాను నిమగ్నమై ఉన్న సమయంలో ఆ పాము నేరుగా వచ్చి అతడి కుర్చీ కిందకు దూరింది. అతడు కాలు కదపగానే ఆ పాము హడలిపోయి ఒక్కసారిగా అతడి కుడి కాలును తాకింది. అంతే, ఆ మెత్తటి స్పర్శకు ఆ వ్యక్తి ఉలిక్కి పడ్డాడు. పామును చూసి షాకయ్యాడు. అయితే, ఈ వీడియోపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ పామును పెంచుకోవాలని కొందరు చెబుతుంటే, దానికి మంచి పేరు పెట్టండని మరికొందరు సూచిస్తున్నారు. కానీ, అతడు మాత్రం తన గార్డెన్‌ను శుభ్రం చేయాల్సిన సమయం వచ్చిందని నెటిజనులతో తెలిపాడు.
View this post on Instagram
Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!
Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?