Viral Video: ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే-హైవేపై భారీ ట్రక్‌ను ఎలా నడుపుతోందో చూడండి
తమిళనాడులో ఓ మహిళ హైవేపై భారీ ట్రక్‌ను ధైర్యంగా నడిపిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఛీర్స్ చెబుతూ...దూసుకుపోతూ...
"మహిళలకు బలం ఉండదు. కష్టమైన పనులు వాళ్లు చేయలేరు" అనే మాటలకు కాలం చెల్లిపోయింది. ఎంత కష్టమైన పనైనా సరే, మహిళలూ పోటీపడి మరీ చేస్తున్నారు. ధైర్యంగా ముందడుగేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ మరోసారి ఈ నిజాన్ని నిరూపించింది. ఓ భారీ ట్రక్‌ను సులువుగా నడిపేస్తోంది. ఎంతో కాన్ఫిడెంట్‌గా హైవైపే నడుపుతూ కనిపించింది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ అవనీశ్ షరన్ ట్విటర్‌లో షేర్ చేశారు. మరో ట్రక్ నుంచి ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా లేడీ డ్రైవర్ నవ్వుతూ ముందుకు దూసుకుపోయింది. "నడిపేది మహిళ, పురుషుడా అని ట్రక్ పట్టించుకోదు" అని అవనీష్ షరన్ ట్విటర్‌లో ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. ట్విటర్‌లో ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్ రాగా, వందలాది రియాక్షన్లు వచ్చాయి. "ఆమె నవ్వులోనే ఆమె ధైర్యం కనిపిస్తోంది" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. "మహిళా సాధికారతకు ఈమే అసలైన ఉదాహరణ" అని కామెంట్ చేస్తున్నారు.
ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022
Bahot tough job hai aur ek lady ko truck chalate dekh kar garv aur samman ki anubhuti hoti hai 🙏🏻
— IamJoshi (@7bd51c24d0e4485) July 18, 2022
Inspirational
— rajivgoyal (@rajivgoyal) July 17, 2022
If you can use your powers to train some 100 women for transport services like Driver and conductor
Wonderful
— GANESH CHOUDHARY (@GANESHC14579242) July 17, 2022
That's new India
Also Read: Konda Counters KCR: గజ్వేల్‌లో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉందేమో? సీఎం క్లౌడ్ బరస్ట్ కామెంట్స్‌పై కొండా లాజికల్ కౌంటర్
Also Read: Jennifer Lopez: నటుడితో డేటింగ్ - నాల్గో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్!