News
News
X

Viral Video: ఫలక్ నుమా శ్మశాన వాటికలో ఆరడుగుల కొండ చిలువ, వీడియో వైరల్

Viral Video: హైదరాబాద్ ఫలక్ నుమా శ్మశాన వాటికలో ఆరడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. పామును గుర్తించిన పలువురు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

FOLLOW US: 

Viral Video: హైదరాబాద్ లోని ఫలక్ నుమా స్మశాన వాటికలో 6 అడుగుల పొడవున్న కొండ చిలువ కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారంది. ఫలక్ నుమాలోని క్వాద్రీ చమన్ శ్మశాన వాటికకు వెళ్లిన కొందరు వ్యక్తులు అక్కడ ఆరుడుగుల కొండ చిలువను గుర్తించారు. వెంటనే సెల్ ఫోన్ లో దాన్ని బంధించారు. అర్ధరాత్రి శ్మశాన వాటికలో పెద్ద పాము సంచరిస్తుండగా తీసిన ఈ వీడియో.. నెటిజెన్లను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు.. ప్రమాదకరమైన ఈ కొండ చిలువను వెంటనే గుర్తించి అక్కడి నుంచి తీసుకెళ్లి అడవిలో వదిలేయాలని కోరుతున్నారు. చిన్న చిన్న పిల్లలు శ్మశాన వాటికలో ఉన్న చింత చెట్టు వద్దకు వెళ్తుంటారని, అలాగే వివిధ కార్యక్రమాల నిమిత్తం అనేక మంది అక్కడకు వస్తుంటారని తెలిపారు. అందవల్ల అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పామును పట్టుకోవాలని కోరారు. 

అయితే ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశారు. "ఫలక్‌నుమాలోని శ్మశాన వాటికలో కొండచిలువ పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది" అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆ పాము వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య రాకూడదంటు కామెంట్లు చేస్తున్నారు.

News Reels

ఇటీవలే బడికెళ్తున్న పాప బ్యాగులో పాము..

ఓ పాఠశాల విద్యార్థిని బ్యాగ్‌లో పాము కనిపించడంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. బ్యాగ్ నుంచి పామును బయటకు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ షాజ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. పాఠశాలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థిని తన బ్యాగ్‌లో ఏదో మెదులుతుందని గ్రహించి.. వెంటనే ఉపాధ్యాయుడికి విషయాన్ని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన టీచర్.. ఆ స్కూల్‌ బ్యాగ్‌ని పూర్తిగా క్లోజ్‌చేసి స్కూల్ బయటకు తీసుకువచ్చారు.

నెమ్మదిగా జిప్‌ ఓపెన్‌ చేశారు. ఆ తర్వాత అందులో ఉన్న పుస్తకాలన్నీ బయటకు తీసేశారు. ఆ తర్వాత బ్యాగ్‌ని తలకిందులుగా చేసి దులపగానే ఒక్కసారిగా తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయుడు షాక్‌ అయ్యారు.

అయితే అదృష్టవశాత్తు ఆ పాము ఆ బ్యాగ్‌ నుంచి బయటపడ్డాక వారిపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో త్రుటిలో పెను ప్రమాదం నుంచి వారంతా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అంతకు ముందు షూలో దర్శనం ఇచ్చిన నాగుపాము..

ఇటీవల ఓ చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన మహిళకు అందులో నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.  క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Published at : 06 Oct 2022 01:13 PM (IST) Tags: Snake Viral Video Viral Video Python Spotted in Hyderabad Six Feet Python in Falaknuma Graveyard Python Viral ideo

సంబంధిత కథనాలు

Watch Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారులు, అరగంట పాటు ఉక్కిరిబిక్కిరి

Watch Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారులు, అరగంట పాటు ఉక్కిరిబిక్కిరి

Viral News: కొంప ముంచిన బెట్ సరదా, స్టేజ్‌పై వధువుకి ముద్దు పెట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Viral News: కొంప ముంచిన బెట్ సరదా, స్టేజ్‌పై వధువుకి ముద్దు పెట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Viral Video: రెచ్చిపోయిన ఆకతాయిలు- కొరియన్ యువతిని వేధించి, కిస్ చేసి!

Viral Video: రెచ్చిపోయిన ఆకతాయిలు- కొరియన్ యువతిని వేధించి, కిస్ చేసి!

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

Indore News: మీ కోడిని కాస్త అదుపులో పెట్టుకోండి, ఉదయమే అరిచి నిద్ర డిస్టర్బ్ చేస్తోంది - ఇదో వింత కేసు

Indore News: మీ కోడిని కాస్త అదుపులో పెట్టుకోండి, ఉదయమే అరిచి నిద్ర డిస్టర్బ్ చేస్తోంది - ఇదో వింత కేసు

టాప్ స్టోరీస్

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!