By: ABP Desam | Updated at : 22 Jun 2023 01:57 PM (IST)
Edited By: jyothi
స్కూటీపై ఎనిమిది మందితో ప్రయాణం ( Image Source : Gopal Goswami Twitter )
Viral Video: ఎంతో అప్రమత్తంగా ప్రయాణాలు సాగిస్తున్నా.. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలవుతుంటారు. వాహనం నడిపే వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా వెనకా, ముందు వచ్చే వాహనాలు సరిగ్గా రాకపోతే ప్రమాదం తప్పదు. అందుకే చాలా మంది చాలా జాగ్రత్తగా బైక్ పై వెళ్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్లు అయితే మరీ జాగ్రత్తగా ప్రయాణాలు సాగిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏడుగురు పిల్లలను వారి బ్యాగులతో సహా బడికి తీసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వీడియోలో ఏం ఉందంటే.?
ఓ వ్యక్తి స్కూటీ నడుపుతుండగా.. ముందు ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని మరీ నిల్చున్నారు. వాహనం నడుపుతున్న అతని వెనుక ముగ్గురు కూర్చోగా... కాళ్లు పెట్టుకుని కూర్చునే స్టాండ్ పై పక్కన మరో బాలుడు నిల్చుని ఉన్నాడు. వెనకాల నెంబర్ ప్లేట్ కు కాస్త మీదుగా ఉండే స్టీల్ రాడ్‌పై మరో బాలుడు నిల్చొని డ్రైవర్ భుజాలను పట్టుకున్నాడు. ఇలా మొత్తం బండి మీద ఎనిమిది మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంత ప్రమాదకర రీతిలో స్కూటీపై ప్రమాదం చేస్తుండగా.. చూసిన పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది చూసిన నెటిజెన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇంత మంది చిన్న పిల్లలతో ప్రయాణం అవసరమా అని కొందరు.. ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని మరికొందకు కామెంట్లు చేస్తున్నారు.
ये बोझ कब कम होगा इस धरती पर ? #UCC
pic.twitter.com/YVZmcIuSX4— Gopal Goswami (@igopalgoswami) June 21, 2023
జోరువానలో గ్యాస్ బండ డెలవరీ రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బిపార్‌జాయ్ తుపాను ఎఫెక్ట్ ఇంకా ఉండనే ఉంది. అంత భారీ వానలోనూ కొందరు తమ డ్యూటీని మాత్రం మర్చిపోవడం లేదు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కరెక్ట్ టైమ్‌కి డెలివరీ చేస్తున్నారు. అలా ఓ గ్యాస్ డెలవరీ బాయ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఓ గ్యాస్ డెలవరీ వ్యక్తి వర్షాన్ని లెక్క చేయకుండా గ్యాస్ బండను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చాడు. ఈ ఏజెంట్ పనిని ఎంతో మెచ్చుకున్నారు హర్‌దీప్ సింగ్. ఉద్యోగంపై ఇంత డెడికేషన్ ఉండటం గొప్ప విషయం అంటూ కితాబునిచ్చారు. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో ధోక్ గ్రామంలో ఈ ఏజెంట్ ఇలా వరదలో కష్టపడుతూనే గ్యాస్ డెలివరీ చేశాడు.
Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్
Viral Video: కార్‌పై క్రాకర్స్ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్
Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్ కావాలా? ఇండియన్స్‌కి క్రేజీ ఆఫర్ ఇచ్చిన థాయ్‌లాండ్
యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో
ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>