Price Is Right Show: అరె ఏంట్రా ఇది - గేమ్‌లో గెలిచానని ఊగిపోయాడు, దెబ్బకు భుజం జరిగిపోయింది
Price Is Right Show: గెలుపొందిన సంతోషంలో ఓ పోటీదారు పెద్దగా సంబరాలు చేసుకున్నాడు. దాంతో తన భుజం పక్కకు జరిగిపోయింది.
Price Is Right Show: విజయం వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటాం. ఇది ప్రతి ఒక్కరూ చేసుకునేది. కష్టపడి చేసే ప్రయత్నంలో మంచి ఫలితం వస్తే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఎగిరిగంతెయ్యాలనిపిస్తుంది. టీవీ షోలలో నిర్వహించే గేమ్స్ లో కంటెస్టెంట్లు గెలిచినప్పుడు ఎంతగా సంబరాలు చేసుకుంటారో చాలా సార్లు చూసే ఉంటాం. వావ్, క్యాష్, జీన్స్ లాంటి గేమ్ షోలలో డబ్బు గెలుచుకుంటే ఒకింత ఎక్కువగా సంబరపడి డ్యాన్సులు చేసేస్తుంటారు పోటీదారులు. అమెరికాలో ది ప్రైస్ ఇజ్ రైట్ అనే గేమ్ షో మంచి పాపులారిటీని అందుకుంది. తాజాగా ఇందులో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తను గేమ్ గెలిచిన తర్వాత చేసుకున్న సంబరాలు, ఆ తర్వాత జరిగిన అసలు ట్విస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతగా ఏం జరిగిందంటే..
ఎగిరిగంతేసిన హెన్రీ, ఆ తర్వాతే అసలు ట్విస్ట్
తాజాగా ది ప్రైస్ ఇజ్ రైట్ గేమ్ షోలో హెన్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. గేమ్ లో భాగంగా బాంకర్స్ అనే గేమ్ ఆడాడు హెన్రీ. హవాయి టూర్ కు ఎంత ఖర్చవుతుందో సరిగ్గా చెబితే ఆ టూర్ కు అయ్యే ఖర్చు అంతా గేమ్ షో నిర్వాహకులే భరిస్తారు. ఈ గేమ్ టైమ్ మొదలు కాగానే.. హెన్రీ చాలా ఉత్సాహంగా గేమ్ ఆడాడు. హవాయి టూర్ కు ఎంత ఖర్చు అవుతుందో చాలా తక్కువ సమయంలోనే సరైన సమధానాన్ని గుర్తించేశాడు. గేమ్ షో హోస్ట్ కూడా హెన్సీ స్పీడ్ కు ఆశ్చర్యపోయాడు. గేమ్ అవ్వగానే హెన్రీ కరెక్ట్ గా సమాధానం చెప్పినట్లు గ్రీన్ సిగ్నల్ రావడంతో హెన్రీ ఎగిరిగంతేశాడు. రెండు చేతులు పైకి కిందకు ఊపుతూ, పిడికి బిగించి గాలిలోకి గట్టిగా పంచులు విసురుతూ, ఆనందంతో ఉర్రూతలూగాడు. అరుస్తూ ఫుల్లుగా సంబరాలు చేసుకున్నాడు.
కట్ చేస్తే..
హెన్రీ తన వైఫ్ తో పాటు తిరిగి స్టేజ్ పైకి వచ్చాడు. చివరి గేమ్ ఆడటానికి ఇద్దరూ రెడీగా ఉన్నారు. అంతలోనే హోస్ట్ వచ్చి అసలు విషయం చెప్పి షాకిచ్చాడు. కొందరికి ఇది షాక్ అయితే, ఇంకొందరు మాత్రం నవ్వుల్లో మునిగిపోయారు. ఏం జరిగిందంటే.. హెన్రీ గెలిచిన ఆనందంలో చేతులు ఊపుతూ, గాలిలోకి పంచులు ఇస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో హెన్రీ కుడి భుజం కాస్త పక్కకు జరిగింది. షోల్డర్ మిస్‌ప్లేస్ కావడంతో చేయి పైకెత్తలేకపోయాడు హెన్రీ. ఇదే విషయాన్ని గేమ్ హోస్ట్ చెప్పాడు. ప్రస్తుతం హెన్రీకి ప్రమాదం లేదని కూడా చెప్పుకొచ్చాడు. గేమ్ హోస్ట్ ఇదంతా చెబుతున్నప్పుడు హెన్రీ ఏడవలేక నవ్వు ముఖం పెట్టాడు.
Also Read: Indigo Flight: ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం, దిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
తర్వాత చివరి గేమ్ నిర్వహించాడు గేమ్ హోస్టు. ఇందులో భార్యాభర్తలు కలిసి ఓ పెద్ద చక్రాన్ని తిప్పాల్సి ఉంటుంది. ఆ పెద్ద చక్రాన్ని హెన్రీ పార్ట్‌నర్ ఒక్కరే గట్టిగా తిప్పారు. అందులో 100కి 95 స్కోర్ రావడంతో అందులోనూ విజయం సాధించారు. అయితే ఈ సారి హెన్రీ కుడి చేతిని కదపకుండా ఎడమ చేతిని మెల్లిగా పైకి లేపి వావ్ అని అరిచాడు. పక్కనే ఉన్న తన భార్య మాత్రం రెండు చేతులు పైకెత్తి సంబరాలు చేసుకుంది.
View this post on Instagram
Join Us on Telegram: https://t.me/abpdesamofficial