Pink Daimond : పింక్ డైమండ్ దొరికేసింది - ఎక్కడ ? ఎలా?
ప్రపంచంలోనే అతి పెద్ద పింక్ డైమండ్ దొరికింది. అసలు ఇది ఎక్కడిదంటే ?
Pink Daimond : వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అత్యంత ఖరీదైన వజ్రాల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అదే పింక్ డైమండ్ అయినా అంతే. కాకపోతే వజ్రాల్లో పింక్ డైమండ్ చాలా అరుదు. అందుకే వాటికి ఇంకా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా ప్రపంచంలో ఇంత వరకూ ఎప్పుడూ బయటపడనంత పెద్ద పింక్ డైమండ్ తాజాగా వెలుగు చూసింది.
ఓ వైపు యుద్ధం జరుగుతుంటే, మీ ఫోటో షూట్‌లేంటి? జెలెన్‌స్కీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఆంగోలా వజ్రాల గనుల్లో అతిపెద్ద పింక్ డైమండ్ లభ్యమైంది. గడిచిన 300 ఏళ్లలో ఇలాంటి వజ్రాన్ని చూడలేదని నిపుణులు ప్రకటించారు. లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వజ్రం.. లూలో మైన్‌లో దొరికింది. అది 170 క్యారెట్ పింక్ డైమెండ్ అని లుకాపా డైమెండ్ కంపెనీ పరీక్షలు చేసి తేల్చింది. అతి సహజమైన రీతిలో దొరికిన అతి అరుదైన వజ్రాన్ని పొందడంపై అంగోలా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది. లూలో మైన్ నుంచి పింక్ వజ్రం లభించడం ఇది రెండవసారి.
రష్యా స్పేస్ ఏజెన్సీ సంచలన నిర్ణయం, డెడ్‌లైన్‌గా 2024 - సమాచారం లేదన్న నాసా
భారీ ధరకు ఆ వజ్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాలని అంగోలా ప్రభుత్వం భావిస్తోంది. అంగోలాలో ఉన్న ఈ మైన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కారణంగా ఈ వజ్రంపై రెండు దేశాలకూ హక్కు ఉంటుంది. లూలో రోజ్ వజ్రాన్ని కటింగ్, పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల ఆ వజ్రం బరువు 50 శాతం తగ్గిపోతుంది. గతంలో 59.6 క్యారెట్ల పింక్ స్టార్ వజ్రాన్ని హాంగ్‌కాంగ్ వేలంలో సుమారు 71.2 మిలియన్ల డాలర్లకు అమ్మేశారు. కొత్తగా దొరికిన పింక్ డైమండ్ అంతకన్నా ఎక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పింక్ డైమండ్‌తో అంగోలా, ఆస్ట్రేలియా పంట పండుతుందని అనుకోవచ్చు.
పింక్ డైమండ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయమే గుర్తుకు వస్తుంది. తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ ఉండేదని.. దాన్ని కాజేశారని అప్పటికి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపిస్తే.. వైఎస్ఆర్‌సీపీ నేతలు చంద్రబాబు ఇంట్లో తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్‌లు ఏమీ శ్రీవారికి లేవని అధికారికంగా ప్రకటించారు. దాంతో పింక్ డైమండ్ అనేది రాజకీయమని తేలిపోయింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో పింక్ డైమండ్ అంటే.. అటెన్షన్ వస్తుంది.