Russia To Quit ISO: రష్యా స్పేస్ ఏజెన్సీ సంచలన నిర్ణయం, డెడ్‌లైన్‌గా 2024 - సమాచారం లేదన్న నాసా
Russia To Quit ISO: అంతరిక్ష కేంద్రం నుంచి 2024 తర్వాత బయటకు రావాలని నిర్ణయించాం అని రష్యా అంతరిక్ష పరిశోధనా కేంద్రం చీఫ్ యురీ బొరిసోవ్ పేర్కొన్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెల్లడించింది.
అనంతమైన విశ్వంపై సాగించే పరిశోధనల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం _ISS ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు రష్యా చేసిన ప్రకటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అవును నిజం... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైంది. 2024 తర్వాతే ఐఎస్‌ఎస్ తో కలిసి తాము కొనసాగలేమని రష్యా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
2024 తర్వాత రష్యా ఔట్ !
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పార్టనరింగ్ కంట్రీస్ కి ఇచ్చిన హామీలకు తప్పకుండా పూర్తిచేస్తాం. కానీ అంతరిక్ష కేంద్రం నుంచి 2024 తర్వాత బయటకు రావాలని నిర్ణయించాం’ అని రష్యా అంతరిక్ష పరిశోధనా కేంద్రం చీఫ్ యురీ బొరిసోవ్ పేర్కొన్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెల్లడించింది. ఇదే విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రష్యన్ స్పేస్ చీఫ్ చెప్పగా ఆయన మంచి పని అన్నట్లు సమాచారం. ఓ వైపు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని రష్యాపై వెస్ట్రన్ కంట్రీస్ కొనసాగిస్తోన్న వేళ క్రెమ్లిన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం డిబేటబుల్ టాపిక్‌గా మారింది.
అంతరిక్షంలో జరిపే పరిశోధనలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఎంతో కీలకంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. 1998లో కక్షలోకి వెళ్లిన ఐఎస్‌ఎస్.. భూ కక్షకు అతి తక్కువ ఎత్తులో ఉండి సేవలను అందిస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు చేసే వ్యోమగాములకు ఇదే హాల్ట్ పాయింట్. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని ఐదు అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.
అమెరికా నాసాతోపాటు (NASA) రష్యా (Roscosmos), జపాన్ (JAXA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), కెనడా (CSA) అంతరిక్ష పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో ఇది కొనసాగుతోంది. గడిచిన ఇరవై ఏళ్లుగా సేవలందిస్తోన్న ఈ కేంద్రంలో వివిధ దేశాలకు చెందిన అనేక మంది వ్యోమగాములు కొన్ని రోజులపాటు అక్కడే ఉంటూ పరిశోధనలు చేపడుతున్నారు.
అయితే రష్యా స్టేట్ ప్రకటనపై నాసా కూడా స్పందించింది. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పందించారు. 2030 వరకూ భాగస్వామ్య స్పేస్ ఏజెన్సీలతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను నిర్వహించేందుకు నాసా సిద్ధంగా ఉందని నెల్సన్ మరో మారు స్పష్టం చేశారు. రష్యా తీసుకున్న నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని బిల్ నెల్సన్ ప్రకటించారు.
రష్యా ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ప్రతీకారంగా ఐఎస్‌ఎస్ నుంచి బయటకు వచ్చేస్తామని గత కొన్ని రోజులుగా పుతిన్ సర్కార్ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ అమెరికా కూడా అదే రీతిలో స్పందిస్తోంది. ఇలా రెండు అగ్రదేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వేళ రష్యా బయటకు వచ్చేందుకు సిద్ధమైంది . అంతే కాదు తామే సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ ను తయారు చేసుకుంటామని రష్యా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభించింది. The Orbital Piloted Assembly and Experiment Complex -OPSEK పేరుతో థర్డ్ జనరేషన్ స్పేస్ స్టేషన్ మాడ్యూలార్ కాన్సెప్ట్ ను డెవలప్ చేసింది రష్యా.