News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rajasthan News: లవ్ జిహాదీ కాదది, ఇద్దరు లెస్బియన్ల ప్రేమ కథ - మైనర్ బాలికతో పారిపోయిన ఉపాధ్యాయురాలు

Rajasthan News: బడిలో చదువుకునే అమ్మాయి అక్కడే టీచర్ గా పని చేసే ఓ మహిళతో పారిపోయింది. ఇంట్లో చెప్పకుండా చెన్నై వెళ్లిపోగా.. ఇది లవ్ జిహాదీలో భాగం అంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

FOLLOW US: 
Share:

Rajasthan News: ఆమె ఓ ఉపాధ్యాయురాలు. పాఠశాలలోని పిల్లలకు పాఠాలు చెబుతోంది. అయితే 12వ తరగతికి చెందిన ఓ బాలికపై ఈమె చాలా ప్రేమ చూపించింది. బాలిక కూడా టీచర్ ను చాలా ఇష్టపడేది. ఇద్దరూ కలిసి గంటల పాటు సమయం గడిపేవారు. అయితే ఇది పిల్లలపై చూపించే ప్రేమ కాదని.. తమకు ఒకరంటే ఒకరు ఇష్టమని త్వరగానే వాళ్లకు అర్థం అయిపోయింది. ఇద్దరూ ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. బతికినన్ని రోజులు కలిసే జీవించాలనుకున్నారు. ఇక ఆలస్యం చేయకూడదని.. ఈ విషయం ఇంట్లో చెప్పినా ఒప్పుకోరని పారిపోవాలనుకున్నారు. రోజూలాగే బడికి వచ్చిన వీరిద్దరూ ఇటీవలే పారిపోయారు. చెన్నైలో కాపురం పెట్టి హాయిగా జీవిస్తున్నారు. కానీ బాలిక తల్లిదండ్రులు మాత్రం ఇది లవ్ జిహాద్ అంటూ పోలీసులను ఆశ్రయించారు. పెద్ద ఎత్తున రచ్చ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే..?

రాజస్థాన్‌లోని బికనీర్‌లో 17 ఏళ్ల బాలిక  ఓ మహిళా టీచర్‌ తో కలిసి పారిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 12వ తరగతి చదివే ఓ బాలిక.. అదే బడిలో పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ తో కలిసి జూన్ 30వ తేదీన పారిపోయింది. అయితే ఉపాధ్యాయురాలే తమ కూతురుకు మాయ మాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లిందని.. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిని ఇస్లాం మతంలోకి మార్చేందుకే ఇలా తీసుకెళ్లారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలోనే బీజేపీ సహా మరికొన్ని మితవాస సంస్థలు నిరసనలు ప్రారంభించాయి. లవ్ జిహాదీ పేరుతో హిందూ బాలికను ఎత్తుకెళ్లారంటూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశాయి. బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ కూడా సోమవారం మహిళల స్వగ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఇలా మాయ మాటలు చెబుతూ చిన్న పిల్లలు మతం మారేలా చేయడం మంచిది కాదని.. ఈ విష సంస్కృతిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామంటూ కామెంట్లు చేశారు. 

బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్లిందంటూ ఫిర్యాదు

అయితే తమ కుమార్తెకు బ్రెయిన్‌ వాష్ చేసి కిడ్నాప్ చేసేందుకు టీచర్, ఆమె సోదరులు కుట్ర పన్నారని మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్, ఆమె ఇద్దరు సోదరులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ మరియు ఐపీసీ సెక్షన్లు 363 (కిడ్నాప్), 366 (ఒక మహిళను కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ చేయడం లేదా పెళ్లికి బలవంతం చేయడం మొదలైనవి), 120బీ (నేరపూరిత కుట్ర) తదితరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

తమ కూతురు కనిపించ్లేదంటూ టీచర్ తల్లిదండ్రుల ఆవేదన

మరోవైపు అదే పోలీస్ స్టేషన్‌లో టీచర్ కుటుంబ సభ్యులు కూడా తమ కూతురు అదృశ్యం అయిందంటూ ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే బడి పూర్తయిన తర్వాత కూడా తన కుమార్తె తిరిగి రాకపోవడంతో.. తాను పాఠశాలకు ఫోన్ చేశానని ఆమె తండ్రి పేర్కొన్నారు. అయితే ఉపాధ్యాయురాలికి పని ఉందని చెప్పి మధ్యలోనే బయటకు వెళ్లిపోయిందని పాఠశాల యాజమాన్యం చెప్పినట్లు ఆయన ఫిర్యాదులో తెలిపారు. దీంతో రెండు వైపుల నుంచి కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

మేము లెస్బియన్లం.. కావాలనే పారిపోయి వచ్చాం!

ఇంతలోనే పారిపోయిన ఇద్దరు మహిళలు కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాము లెస్బియన్లమని, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పారు. ముందుగా మైనర్ బాలిక మాట్లాడుతూ.. మీరందరూ టీచర్ నాకు బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్లిందని అనుకుంటున్నారు కానీ.. అలాంటిదేమీ లేదని తెలిపింది. అలాగే తామిద్దరూ ఇష్టపడే పారిపోయి వెళ్లినట్లు వెల్లడించింది. ఒకరిని వదిలి మరొకరం బతకలేకే ఈ నిర్ణయం తీసున్నామని స్పష్టం చేసింది. ఈ తర్వాత ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ.. తాము లెస్బియన్లమని.. మరెవరినీ పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని వివరించింది. జీవితాంతం కలిసుండాలనే కోరికతానే తాము ఇలా వచ్చేసినట్లు స్పష్టం చేసింది. వీడియో చూసిన పోలీసులు.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్లు ఎక్కుడున్నారనే విషయాన్ని గుర్తించారు. 

లవ్ జిహాదీ కాదిది.. లెస్బియన్ల వ్యవహారం

అమ్మాయిలు ఇద్దరూ చెన్నైలో ఉన్నట్లు తెలుసుకుని వెంటనే అక్కడకు వెళ్లిపోయారు. తాము వెళ్లేసరికి అక్కడే ఇద్దరే అమ్మాయిలు ఉన్నారని.. ఇది లవ్ జిహాదీకి సంబంధించిన విషయం కాదని పోలీసులు చెబుతున్నారు. వారు ఒకరినొకరు ఇష్టపడే అక్కడకు వచ్చినట్లు తెలిపారు. అయితే బాలిక మైనర్ కావడం వల్ల ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి)కి అప్పగిస్తామని చెప్పారు. ఆ తర్వాతే ఆమెను ఇంటికి పంపాలా లేదా ప్రభుత్వానికి అప్పగించాలా అనేది నిర్ణయిస్తారని వెల్లడించారు. 

Published at : 06 Jul 2023 03:14 PM (IST) Tags: Rajasthan Love Jihad Latest Viral News Minor Girl Love Two Girls Ran Away

ఇవి కూడా చూడండి

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి