అన్వేషించండి

Viral Video: విమానం గాల్లో ఉండగా బాయ్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన యువతి

Viral News: తన ప్రేమను తన ప్రియుడికి తెలిపి పెళ్లికి ఇండిగో ఫ్లైట్‌లో ప్రపోజ్ చేసింది. ఈ అందమైన క్షణాన్ని ఐశ్చర్య బన్సాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

Passenger Proposes To Boyfriend In Flight:  తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేసే క్షణం ప్రతి వ్యక్తి జీవితంలో మరిచిపోలేనిది. కొందరు తమకున్న స్థాయిలో సింపుల్ గా ప్రపోజ్ చేస్తే.. మరికొందరు చాలా  గొప్పగా స్పెషల్ గా ప్రపోజ్ చేస్తుంటారు. ఓ యువతి కూడా ఇదే విధంగా విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసింది.  ఇండిగో విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో… ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇలాంటివి చేస్తుంటారు. కానీ, ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ ఆశ్చర్య పరిచే విధంగా ప్రపోజ్ చేసింది.  ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

మోకాళ్లపై నిలబడి..
చంఢీగఢ్ రాష్ట్రానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐశ్వర్య బన్సల్ తన ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.  తన ప్రేమను తన ప్రియుడికి తెలిపి పెళ్లికి ఇండిగో ఫ్లైట్‌లో ప్రపోజ్ చేసింది. ఈ అందమైన క్షణాన్ని ఐశ్చర్య బన్సాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ అమూల్య గోయల్‌తో కలిసి ఐశ్వర్య ఇండిగో ఫ్లైట్‌లో ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లాన్ ప్రకారం.. ఫ్లైట్‌లో ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఇంతలో ఐశ్వర్య నడుచుకుంటూ వస్తుంది. అమూల్య గోయల్‌ ముందు ఐశ్వర్య బన్సాల్  మోకాళ్లపై కూర్చుంటుంది. ఆమె చేతిలో ఉన్న ఉంగరాన్ని అమూల్య గోయల్ కు తొడిగి  ప్రపోజ్ చేస్తుంది. ఇంతలో ఆమె వెనుక కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకుని నిలబడతారు. ఆ పోస్టర్లపై విల్ యూ మ్యారీ మీ (మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?) అని రాసి ఉంది.  

సిగ్గుల మొగ్గయిన అమూల్య గోయల్
తన ప్రియురాలు చేస్తున్నదంతా చూసిన ఆశ్చర్య పోయిన అమూల్య గోయల్ సిగ్గుల మొగ్గేశారు. ఐశ్వర్యతో ప్రపోజ్ కి ఫిదా అయిన గోయల్ తనను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు సమాధానమిస్తాడు. ఐశ్వర్య అతనికి ఉంగరం తొడుగుతుంది. వీడియోను షేర్ చేస్తూ ఐశ్వర్య వీడియోకు ఓ క్యాప్షన్ ఇచ్చింది. . ‘OMG, , నేను అనుకున్నదానికంటే ఇది చాలా బాగుంది. నేను అతడికి ప్రత్యేకమైన రీతిలో ప్రపోజ్ చేయాలనుకున్నాను. అకస్మాత్తుగా ఈ ఆలోచన నా మదిలో వచ్చింది. దీనికి సిబ్బంది అనుమతి ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ.. వారు అంగీకరించారు. స్పెషల్ థ్యాంక్స్ టూ ఇండిగో” అంటూ రాసుకొచ్చింది.  

వైరల్ అవుతున్న వీడియో 
ఈ పోస్ట్ ఆగస్టు 26న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది పోస్ట్ చేసినప్పటి నుండి రెండు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోకు చాలా మంది లైక్స్, కామెంట్స్ కూడా వచ్చాయి. దీనిపై ప్రజలు కూడా తమదైన స్టైల్లో కామెంట్ చేస్తున్నారు.  ఓ నెటిజన్ "వారు ఉచితంగా ఆహారం ఇస్తారా, అలా అయితే నేను నా భర్తకు మరోసారి పెళ్లి ప్రపోజ్ చేస్తాను" అంటూ సరదాగా కామెంట్ చేశారు. మరొక నెటిజన్, “దయచేసి, మీరు దీన్ని చేసేందుకు ఇండిగోను అభ్యర్థించారో నాకు చెప్పగలరా?’’ అంటూ కామెంట్ చేశారు.

View this post on Instagram
 
A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_)

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget