Kanye West: ఇదేం డిజైన్ సామీ, సగం ఉడికించి వదిలేసిన పాస్తాలా ఉంది-ఈజీ షూ డిజైన్‌పై సెటైర్లు
ఈజీ కంపెనీ షూ డిజైన్‌ను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
మోమోసా, షూసా..?
బట్టలు, షూస్ డిజైనింగ్ చేయటం అంత సులువేమీ కాదు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కంపెనీలు డిజైన్‌లలో మార్పులు
చేర్పులు చేస్తూ కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు కిందామీదా పడుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని వెరైటీ డిజైన్లు పుట్టుకొస్తుంటాయి. అవి మిస్‌ఫైర్ అవ్వటమే కాకుండా, బ్రాండ్ ఇమేజ్‌నీ దెబ్బ తీస్తాయి. ఇంకొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈజీ బ్రాండ్‌కు చెందిన షూ డిజైన్‌ను విడుదల చేసింది ఆ సంస్థ. ట్విటర్‌లో ఆ డిజైన్ ఫోటోలనూ షేర్ చేసింది. అక్కడి వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే ర్యాపర్ కాన్యే వెస్ట్ ఈ ఫోటోను షేర్ చేశాడో అప్పటి నుంచి ఈ పేరు మారుమోగిపోతోంది. ఇదేం డిజైన్‌రా నాయనా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫన్నీ ట్వీట్‌లు చేసే కాన్యే వెస్ట్, ఈ సారి
కూడా అదే తరహాలో "నా షూస్ ఎలా ఉన్నాయో చెప్పండి" అంటూ ట్వీట్ చేశాడు. ఈ డిజైన్ చూసిన నెటిజన్లు ఆ కంపెనీని ఓ ఆటాడుకుంటున్నారు. కొందరు సాసేజ్ రోల్స్ అని అంటుంటే, ఇంకొందరు మోమోస్‌తో పోల్చుతున్నారు. "బేకింగ్ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయిందేమో" అని ఇంకొందరు రిప్లై ఇస్తున్నారు.
YZY 450 SULFUR
— YEEZY MAFIA (@theyeezymafia) July 11, 2022
HOW DO YOU FEEL ABOUT THE SULFUR SO FAR? pic.twitter.com/WSWPwMrbbp
Looks like compressed pasta
— Noriega (@313Noriega) July 12, 2022
Looks like the failed recipe I tried off of Tik Tok 😩 pic.twitter.com/kUGNcq4jYm
— Nancy (@nancylasocki) July 12, 2022
Momo Shoes https://t.co/FLkpJVt6jm
— Godman Chikna (@Madan_Chikna) July 12, 2022
Remind me of the Pizza Monsters from the original TMNT cartoon pic.twitter.com/JeKk4ldPl4
— Aaron Cooper (@aarxn82) July 11, 2022