అన్వేషించండి

Indian Railways: రైలు ఎక్కగానే ఇట్టే నిద్ర పట్టేస్తుంది. ఎందుకో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే గురించి కొన్ని నమ్మలేని వాస్తవాల ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Indian Railways: భారతీయులకు రైల్వేలకు అవినాభావ సంబంధం ఉంది. దేశంలోని మారుమూల ప్రాంతాలను కూడా భారతీయ రైల్వే కనెక్ట్ చేస్తుంది. 15 లక్షల మందికి పైగా ఉపాధి అందిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది. రైల్వేకు భారతీయులకు ఉన్న సంబంధం ఈనాటిది కాదు. 1854 నుండి రైళ్లు భారత్‌లో సేవలు అందిస్తున్నాయి. పరిమాణంలో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. రోజూ 13 మిలియన్ల మంది రైల్వేలో ప్రయాణిస్తారని అంచనా. ఇలాంటి భారతీయ రైల్వే వ్యవస్థ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం.

ఒక్క స్టేషన్ - 2 రాష్ట్రాలు

ఈ స్టేషన్ ప్రత్యేకత వేరు. మిగతా రైల్వే స్టేషన్ల మాదిరిగా కాదు. కనీసం మన ఊహకు కూడా అందని ప్రత్యేకత దీని సొంతం. ఎందుకంటే ఈ ఒక్క స్టేషన్ రెండు రాష్ట్రాల్లో ఉంటుంది. అదేంటి అంటారా.. అదంతే. ఆ రైల్వే స్టేషన్ పేరు నవాపూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ సగం మహారాష్ట్రలో, మిగిలిన సగం గుజరాత్ లో ఉంటుంది. 

నాన్ స్టాప్ రైల్ మార్గం

త్రివేండ్రం- నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ దేశంలోని అత్యంత పొడవైన నాన్-స్టాప్ రైలు మార్గం. ఇది వడోదర, కోటా మధ్య 528 కిలోమీటర్ల దూరాన్ని 6.5 గంటల్లో చేరుకుంటుంది. ఎలాంటి హాల్టింగ్ లేకుండానే ఇంత దూరం ప్రయాణిస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిందే.

ఇంత తక్కువ దూరం నడిచి కూడా వెళ్లొచ్చు కదా!

సాధారణంగా రెండు రైల్వే స్టేషన్ల మధ్య పదుల కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం 2.8 కిలోమీటర్లు మాత్రమే. ఈ స్టేషన్లు ఒకటి నాగ్ పూర్ లో, మరొకరి అజ్నిలో ఉన్నాయి. ఇంత తక్కువ దూరం నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు కదా దాని కోసం స్టేషన్ ఎందుకు అనిపిస్తుంది కదా. 

Also Read: Coin On Railway Track: రైలు పట్టాలపై ఎప్పుడైనా నాణెం పెట్టారా? ఏమవుతుందో తెలుసా?

అతి పొడవైన పేరు గల స్టేషన్

ఈ రైల్వే స్టేషన్ పేరు ఏకంగా ఓ గూడ్స్ రైలంతా పొడవు ఉంటుంది. ఈ స్టేషన్ చెన్నైలో ఉంది. దాని పేరు వెంకటనరసింహరాజువారిపేట(VENKATANARASIMHARAJUVARIPETA). అతి చిన్న పేరు గల స్టేషన్ కూడా ఉంది. దాని పేరు 'ఐబీ'. ఇది ఒడిశాలోని జార్సుగూడ సమీపంలో ఉంటుంది.

ఈ ప్రయాణం సాగిపో...తుంది

భారత దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం ఏంటో తెలుసా? 4,286 అక్షరాల 4 వేల కిలోమీటర్లకు పైగా ఈ మార్గం ఉంటుంది. ఈ మార్గంలో వివేక్ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుంది. 82.30 గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 56 స్టాప్ లు ఉంటాయి. దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు నడుస్తుంది.

ఒక ప్రాంతం - 2 స్టేషన్లు

శ్రీరాంపూర్, బేలాపూర్ రైల్వే స్టేషన్ ఇవి రెండూ ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఇటు వైపు ప్లాట్‌ఫాం ఉన్న స్టేషన్ పేరు శ్రీరాంపూర్ అయితే.. అటువైపు ప్లాట్‌ఫాం ఉన్న స్టేషన్ పేరు బేలాపూర్. ఈ వింత స్టేషన్లు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉన్నాయి. 

Also Read: Stones On Railway Track: రైలు పట్టాల మధ్యలో రాళ్లు వేస్తారు, మరి మెట్రోకు ఎందుకు వేయరో తెలుసా?

గంటా, 2 గంటలు కాదు.. 10, 12 గంటలు ఆలస్యం

రైళ్లు అనగానే గుర్తొచ్చేది సమయపాలన. ఎప్పుడూ సమయానికి రావు రైళ్లు. టైంకు వచ్చే రైళ్లు దేశం మొత్తంలో వేళ్లపై లెక్కబెట్టగలిగేవన్నీ కూడా ఉండవు. అయితే అన్ని రైళ్ల మాదిరిగానే గౌహతి-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యంగా వస్తుంది. అయితే ఈ రైలు గంటా రెండు గంటలు కాదు ఏకంగా.. 10, 12 గంటలు ఆలస్యంగా వస్తుంది. అలా కూడా రికార్డు సాధించింది.

రైలు ఎక్కగానే నిద్రపట్టేస్తుందా.. దానికీ ఓ కారణం ఉంది

రైలులో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే అలా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు చాలా మంది. అంత త్వరగా నిద్ర ఎలా పడుతుందని ఎప్పడైనా ఆలోచించారా? ఎందుకంటే, రైలు కోచ్‌లు 1.2Hz సస్పెన్షన్ రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీతో తయారు చేస్తారు. ఇది మానవ శరీరానికి అత్యంత సౌకర్యవంతమైన ఫ్రీక్వెన్సీ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget