Stones On Railway Track: రైలు పట్టాల మధ్యలో రాళ్లు వేస్తారు, మరి మెట్రోకు ఎందుకు వేయరో తెలుసా?
Stones On Railway Track: రైల్వే ట్రాక్ మధ్యలో రెండు వైపులా రాళ్లు ఉండడం మనం గమనించే ఉంటాం. కానీ మెట్రో రైలుకు అలాంటి రాళ్లేవి కనిపించవు. దీని వెనుక గల కారణాలు ఏంటో తెలుసా?
Stones On Railway Track: రైల్వే ట్రాక్ మధ్యలో అలాగే రెండు వైపులా రాళ్లు ఉండడం మనం తరచుగా గమనిస్తూ ఉంటాం. అయితే ఇలా రాళ్లు అక్కడ ఎందుకు వేస్తారో మాత్రం చాలా మందికి తెలియకపోయినప్పటికీ.. ఇలా వేయడం తప్పనిసరి అని అనుకుంటారు. కానీ అదే మెట్రో రైలు వద్ద ఎలాంటి రాళ్లు లేకపోవడం కూడా మనం చూస్తుంటాం. అక్కడ వేస్తూ.. ఇక్కడ రాళ్లు వేయకపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే ట్రాక్ మీద ఉండే రాళ్లు "ట్రాక్ బ్యాలస్ట్"
రైల్వే ట్రాక్ మీద ఉండే రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు. అలాగే రైల్వే ట్రాక్ కింద పర్పెండిక్యులర్ గా ఒక బ్లాక్ లాంటిది పెడుతుంటారు. వాటిని రైల్వే స్లీపర్స్ అని అంటారు. రైల్వే ట్రాక్స్ మధ్య గ్యాప్ కరెక్ట్ గా ఉండేలా, అలాగే ట్రాక్ ఎప్పుడూ నిటారుగా ఉండేలా ఉంచడానికి ఈ రైల్వే స్లీపర్స్ ఉపయోగపడతాయి. రైల్వే స్లీపర్స్ ను రైల్ రోడ్ టై లేదా క్రాస్ టై అని కూడా పిలుస్తుంటారు. అంతకుముందు రైల్వే స్లీపర్స్ ను చెక్కతో తయారు చేసేవాళ్లు. ఆ తర్వాత వీటిని కాంక్రీట్ తో కూడా తయారు చేస్తున్నారు. ఇక ట్రాక్ బ్యాలస్ట్ అనేది రైల్వే ట్రాక్ లపై కంకర రాళ్లతో ఉంటుంది. అవి ట్రాక్ బెడ్ ను ఏర్పరుస్తాయి. రైల్వే ట్రాక్ ల చుట్టూ ప్యాక్ చేస్తారు. అయితే ఇవి పైన చెప్పుకున్న స్లీపర్లకు నేలగా ఉంటుంది. ఇవి రైల్వే ట్రాక్ లను నిటారుగా, సరిగ్గా ఉంచడానికి ఉపయోగపడతాయి. రైల్వే స్లీపర్లు ట్రాక్ లకు లంబంగా ఉంచిన దీర్ఘ చతురస్రాకార సపోర్ట్ పీస్.
Also Read: Coin On Railway Track: రైలు పట్టాలపై ఎప్పుడైనా నాణెం పెట్టారా? ఏమవుతుందో తెలుసా?
షార్ప్ గా కదలకుండా ఉండే రాళ్లనే ఉపయోగిస్తారు..!
ట్రాక్ బ్యాలస్ట్ కోసం కంకర రాళ్లను ఉపయోగిస్తారు. అయితే వీటి కోసం అలంకరణకు ఉపయోగించినట్లుగా గుండ్రటి రంగు రాళ్లను ఉపయోగించరు. కేవలం షార్ప్ గా ఉండే రాళ్లను మాత్రమే వాడుతుంటారు. అలాగే ఇవి ఎక్కువగా కదలకుండా ఉండేలా చూసుకుంటారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఆ వేగానికి ఇవి దొర్లుతాయి. అందుకే కదలకుండా ఉండే షార్ప్ రాళ్లను వాడుతారు. రైల్వే ట్రాక్ ల పై అలంకరణకు ఉపయోగించినట్లుగా మృదువైన, గుండ్రటి గులకరాల్లను అస్సలే ఉపయోగించరు. అలాగే వీటి వల్ల అక్కడ ఎలాంటి మొక్కలూ పెరగవు. చెట్లు, పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగితే రైల్వే లైన్లు బలహీనం అయిపోతాయి. అంతేకాదు ట్రాక్ బ్యాలస్ట్ వర్షపు నీటిని ట్రాక్ లో చేరకుండా చేస్తుంది. అలాగే ట్రాక్ ల కింద చుట్టూ సరైన డ్రైనేజీని సులభతరం చేస్తుంది. రాళ్లు ఉన్నచోటే ఉండగా.. నీరు మాత్రం కిందకు వెళ్లిపోతుంటుంది. అలాగే రైలు శబ్దాన్ని కూడా ట్రాక్ పక్కన ఉన్న రాళ్లు తక్కువ చేస్తాయి. ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల రైల్వే ట్రాక్ పై రాళ్లను ఏర్పాటు చేస్తారు.
రెండింటికీ తేడా ఇదే..!
అలాగే మెట్రో స్టేషన్ల మాత్రం రాళ్లను ఉపయోగించరు. ఎందుకుంటే మెట్రో స్టేషన్ లో ట్రాక్ నిర్మించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వీల్ లోడ్ తట్టుకునే విధంగా ట్రాక్స్ ను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు జనాలకు, ట్రాక్ కు మధ్య ఎక్కువ దూరం కూడా ఉండదు. ట్రాక్ బ్యాలస్ట్ కనుక ఉంటే రాళ్లు ఎగిరి జనాలకు తగిలే అవకాశం ఉంటుంది. మెట్రో స్టేషన్లు చాలా వరకు క్లోజ్డ్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి లోపల నడిచే రైళ్లను లిమిటెడ్ స్పీడుతో నడుపుతుంటారు. ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మెట్రో రైలుకు తగిన సాంకేతికతతో ట్రాక్ నిర్మాణం ఉంటుంది. అందుకే రాళ్లు ఉండవు.