అన్వేషించండి

Viral News: బిజినెస్ మెన్ ఇంటికి రూ.210 కోట్ల కరెంట్ బిల్లు - ఫిర్యాదులో వెలుగులోకి వచ్చిన అసలు విషయం

Electricity Bill : విద్యుత్ శాఖ ఒక వ్యాపారవేత్తకు 210 కోట్ల రూపాయల భారీ బిల్లును పంపింది. దీంతో ఆవాక్కయిన ఆ వ్యక్తి వెంటనే ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Electricity  Bill : ఎప్పుడూ వచ్చే దాని కన్నా ఒక్క నెల ఎక్కువ కరెంటు బిల్లు వస్తేనా తెగ హైరానా పడిపోతూంటాం. ఈ నెల ఎందుకు ఎక్కువొచ్చిందా అని ఆలోచిస్తుంటాం. సాధారణంగా ఒక ఇంటికి వచ్చే కరెంటు బిల్లు రూ.1000 - 3వేల వరకు రావొచ్చు. ఇంకొన్ని సార్లు వాడకాన్ని బట్టి మరికొంత ఎక్కువ ఉండొచ్చు. ఎంత వాడినా అది దాదావు రూ.5వేల లోపే ఉంటుంది. కానీ ఓ వ్యక్తి ఇంటికి ఏకంగా రూ.210 కోట్ల బిల్లు వేశారు. దీంతో అవాక్కైన ఆ వ్యక్తి వెంటనే అధికారులను సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విద్యుత్ శాఖ ఒక వ్యాపారవేత్తకు రూ.210 కోట్ల భారీ బిల్లును పంపింది. భోరంజ్ సబ్ డివిజన్ పరిధిలోని బెహ్‌దవిన్ జట్టన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాంక్రీట్ ఇటుకల తయారీ పరిశ్రమను నిర్వహిస్తోన్న లలితా ధీమాన్ అనే చిన్న తరహా వ్యాపారి రూ.210 కోట్లకు పైగా విద్యుత్ బిల్లు రావడంతో కంగుతిన్నారు. బిల్లుపై కచ్చితమైన మొత్తం రూ. 210,42,08,405 కావడం వారిని షాక్‌కు గురిచేసింది. కాంక్రీట్‌తో సిమెంట్‌ ఇటుకలను తయారు చేస్తున్న లలిత్ ధీమాన్‌, వారి కుమారుడు ఆశిష్‌ ధిమాన్‌లకు విద్యుత్‌ బోర్డు ఉద్యోగి భారీ బిల్లును అందజేశారు. తేడాను గుర్తించిన వారు వెంటనే విద్యుత్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బిల్లును రూ.4,047కు సవరించారు.

Also Read : Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో చిక్కుకున్న యూట్యూబర్ - సోషల్ మీడియాలో వీడియో రిలీజ్

అసలేమైందంటే..

అధికారులకు లలిత్ ధీమాన్ ఫిర్యాదు చేయడంతో.. వారు విద్యుత్ బిల్లుల రికార్డును పరిశీలించారు. సాంకేతిక లోపం వల్లే ఇంత బిల్లు వచ్చిందని  భోరంజ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎస్‌డిఓ అనురాగ్ చందేల్ అసలు విషయం తెలియజేశారు. ఫిర్యాదు అందిన తర్వాత, బిల్లును సరిదిద్దారు. సవరించిన బిల్లులో 836 యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్టు తెలిసింది. ఏదైమైనా బిల్లు రూ.210కోట్లు కాదని, రూ.4,047 అని సవరించడంతో ఆ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై పలు రకాలు కామెంట్స్ చేస్తున్నారు.

గతంలోనూ..

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన ఉదంతాలున్నాయి. 2024లో గుజరాత్ లోని వల్సాద్ ప్రాంతంలో టైలరింగ్ దుకాణం నడిపే అన్సారీ అనే వ్యక్తి ఇంటికి రూ.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో కంగుతున్న ఆయన.. అధికారులను సంప్రదించారు. డిస్కం అధికారులు  అతని దుకాణానికి చేరుకుని మీటర్ ను పరిశీలించారు. సాంకేతికం లోపం వల్లే ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వచ్చిందని స్పష్టం చేశారు. మీటర్ రీడింగ్ కు మరో రెండు అంకెలు చేరడంతో ప్రింట్ తప్పుగా పడిందని తెలిపారు.

Also Read : Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Viral News: బిజినెస్ మెన్ ఇంటికి రూ.210 కోట్ల కరెంట్ బిల్లు - ఫిర్యాదులో వెలుగులోకి వచ్చిన అసలు విషయం
బిజినెస్ మెన్ ఇంటికి రూ.210 కోట్ల కరెంట్ బిల్లు - ఫిర్యాదులో వెలుగులోకి వచ్చిన అసలు విషయం
Embed widget