అన్వేషించండి

Fruit chai of Surat: యాపిల్, సపోట, అరటి పండ్లతో చాయ్, ఇతడిని ఎవరికైనా చూపించండయ్యా!

ప్రపంచంలో ఎన్నో ఘోరాలను చూస్తున్నాం. కాబట్టి, ఇది పెద్ద ఘోరంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆ టీ తాగేవాడి పరిస్థితి తలచుకుంటేనే కాస్త బాధ వేస్తోంది.

Tea with Fruits | చాయ్ అంటే.. చిక్కని పాలలో కాసింత టీపొడి వేసి, బాగా మరిగిస్తే చాలు. కాస్త ఘాటుగా కావాలంటే అల్లం లేదా యాలికలు వేసుకోవాలి. అంతేగానీ, చేతికందిన పండ్లు, కాయగూరలు వేసేస్తారా? ఇది చాలా దారుణం కదా? అందుకే, నెటిజనులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చాయ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

క్రియేటివిటీ మంచిదే.. కానీ, మరీ ఇంత అరాచకమైన క్రియేటివిటీని భరించడం కాస్త కష్టమే. ముఖ్యంగా ఆహర పానీయాల తయారీల విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. తేడా వస్తే.. కడుపు కల్లోలమైపోతుంది. ఏదో ఒకటి రెండు కాబినేషన్ల ఆహారాలు బాగానే ఉంటాయి. కానీ, సహజ శైలికి విరుద్ధంగా కొత్త రుచులను ప్రయత్నిస్తే.. ఆహార ప్రియులు స్వాగతించడం కష్టమే. కొందరికైతే కడుపులో వికారం కూడా కలుగుతుంది. 

మొన్నటివరకు రకరకాల వింత వంటకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడాన్ని మీరు చూసే ఉంటారు. ఐస్ క్రీమ్ వడా పావ్, గులాబ్ జామూన్ పాన్ కేక్‌లు, మ్యాగీ పానీ పూరి, కివి పిజ్జా, చాక్లెట్ మ్యాగీ వంటి ఎన్నో అరాచకమైన వంటలను ఇటీవల చూడాల్సి వచ్చింది. ఇటీవల అలాంటి ప్రయోగాలేవీ జరగడం లేదులే.. అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. ఇదిగో ఈ ‘ఫ్రూట్ టీ’ ప్రత్యక్షమైంది. 

Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?

గుజరాత్‌లో సూరత్‌కు చెందిన ఓ టీ వ్యాపారి.. చాయ్ తయారీకి పండ్లను ఉపయోగిస్తున్నాడు. అందులో పాలు, టీపొడి మాత్రమే కాదు.. అరటి పండు, యాపిల్ పండు, సపొటను చీల్చి చెండాడి మరీ చాయ్‌లో కలిపేస్తున్నాడు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కప్పులో వేసి కస్టమర్లకు అందిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 78 వేల మందికి పైగా దీన్ని వీక్షించారు. ఈ ఘోరం చూసి.. కొందరు ఆహార ప్రియులు ‘‘ఆయన్ని ఎవరికైనా చూపించడయ్యా’’ అని అంటున్నారు. మరికొందరు ‘‘చాయ్‌కు న్యాయం కావాలి’’ అని నినాదిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి మీ నిరసన వ్యక్తం చేయండి. 

Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే

View this post on Instagram
 
A post shared by Amar Sirohi (@foodie_incarnate)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Godzilla X Kong Review: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Godzilla X Kong Review: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Embed widget