Malaysian Bar Sells Cocktails: ఇది విన్నారా? 'ఎక్స్ట్రాజెనకా' కాక్‌టైల్ అట! టీకాల పేర్లతో మందు బ్రాండ్లు!
ప్రముఖ కరోనా వ్యాక్సిన్‌ల పేర్లతో మలేసియాలో ఓ బార్ కాక్‌టైల్స్‌ను అమ్ముతోంది. టీకాలపై ప్రచారం కూడా చేసినట్లు ఉంటుందని బార్ నిర్వాహకులు అంటున్నారు.

మలేసియాలోని ఓ బార్ వినూత్నంగా ఆలోచించింది. ప్రముఖ కరోనా వ్యాక్సిన్‌ల పేరుతో కాక్‌టైల్స్‌ను అమ్ముతోంది. వ్యాక్సినేషన్‌పై ప్రచారం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్ యజమానులు అంటున్నారు.
ఇక్కడ దొరికే బ్రాండ్ల పేర్లు..
ఫైజర్‌మైస్టర్, సినోసౌర్, ఎక్ట్రాజెనకా వంటి కరోనా టీకా తరహా పేర్లతో ఈ కాక్‌టైల్స్ విపరీతంగా ప్రచారమయ్యాయి. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా బ్యాక్‌డోర్ బొడెగా బార్ బోసిపోయింది. అయితే లాక్‌డౌన్ ఉపశమనాలుగా పేరు పెట్టి ఈ కాక్‌టైల్స్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారు బార్ నిర్వాహకులు.
VIDEO: A Malaysian bar is offering bottled cocktails named after well-known Covid-19 vaccines, with the alcoholic doses recommended to be served on the rocks pic.twitter.com/c2TjKmpSXz
— AFP News Agency (@AFP) September 16, 2021





















